Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)

హైదరాబాద్ రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు.

Auto Rickshaw Risky Stunts (Credits: X)

Hyderabad, Nov 3: హైదరాబాద్ రోడ్లపై (Hyderabad Roads) ప్రమాదకర స్టంట్లు చేస్తున్న యువత తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అసౌకార్యాన్ని కలిగిస్తున్నారు. ఇటీవల టీ-హబ్ (T-Hub) వద్ద బైక్ స్టంట్లు చేస్తున్న దాదాపు 40 బైక్స్ ను సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా ఓ ఆటో వాలా వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ ఓ ఆటో వాలా స్టంట్లు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్.. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. ఆలస్యంగా విమానాలు

క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై వికృతమైన స్టంట్లు

దీపావళి పండుగ రోజు యువత వెర్రి చేష్టలు వేసింది. క్రాకర్స్ కాలుస్తూ బైక్ పై వికృతమైన స్టంట్లు చేస్తున్న టీనేజర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యువత తీరుపై ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ‘పండుగ పూట ఇదేం వికృతానందం..? ఈ సమాజం ఎటు వెళ్తోంది..?’ అంటూ ఎక్స్ లో వీడియోలు పోస్ట్ చేసిన సజ్జనార్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను ఏ టెస్టులకైనా సిద్ధమంటూ మెరుగు నాగార్జున సవాల్, మహిళ తనపై చేసిన అత్యాచారం ఆరోపణలను ఖండించిన వైసీపీ నేత, వీడియో ఇదిగో..