Atmanirbhar Bharat: చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు
భారత్ - చైనా సరిహద్దులోని గాల్వార్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు (China) తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగానూ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ (Department of Telecom) నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
New Delhi, June 18: భారత్ - చైనా సరిహద్దులోని గాల్వార్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు (China) తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగానూ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని
భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ (Department of Telecom) నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. అమరవీరునికి అశ్రు నివాళి, సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు పూర్తి, జనసంద్రమైన సూర్యాపేట, వీరుడా నీకు జోహర్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
ఆత్మ నిర్భర్ భారత్ లో (Atmanirbhar Bharat) భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made In India) వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు త్వరలో కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. ఘర్షణకు ప్రధాన కారణం అదేనా? ఈ నెల 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలకు పిలుపు, మీ త్యాగం దేశం ఎన్నడూ మరచిపోదన్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్‌లో 'హిందీచీనిబైబై', 'భారత్ వర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఇక ప్రయివేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తిచేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించమనే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి టెలికం సంస్థలు చైనాకు చెందిన హువాయ్ నెట్‌వర్క్స్‌తోనూ, బీఎస్ఎన్ఎల్ జీటీఈతో కలిసి పనిచేస్తున్నాయి. చైనా సంస్థలు ఉత్పత్తిచేసే నెట్‌వర్క్ పరికరాల భద్రతపై ముందు నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
ఇదిలా ఉంటే అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు సైతం చైనా టెలికమ్ పరికరాలపై 2012లో సందేహాలు వ్యక్తం చేశారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను హువాయ్ హ్యక్ చేసిందని భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించి, దర్యాప్తునకు ఆదేశించింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే 5 జి నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియోకు ఒక్క చైనా నెట్‌వర్క్ భాగం కూడా ఉండదని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. చైనా పరికరాలను ఉపయోగించని ప్రపంచంలోని ఏకైక నెట్‌వర్క్ రిలయన్స్ జియో అని గత ట్రంప్ పర్యటనలో ఆయనకి చెప్పారు. ఇప్పుడు జియో 4జి, 5 జి నెట్‌వర్కింగ్ భాగస్వామిగా దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ కొనసాగుతోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)