Diabetes Cure: రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసిన చైనా పరిశోధకులు.. ‘సెల్‌ థెరపీ’తో అసాధ్యం సుసాధ్యం.. 11 వారాల్లోనే ఇన్సులిన్‌ కు చెల్లు

రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసి రికార్డు సృష్టించారు. క్లోమంలోని కణజాలంపై షుగర్‌ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్‌ ద్వారా తొలుత పరిశోధకులు విశ్లేషించారు.

sugar

Newdelhi, May 28: డయాబెటిస్‌ (diabetes) చికిత్సలో చైనా పరిశోధకులు (China Scientists) కీలక ముందడుగు వేశారు. రోగి షుగర్‌ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసి రికార్డు సృష్టించారు.  క్లోమంలోని కణజాలంపై షుగర్‌ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నదో కృత్రిమ అల్గారిథమ్‌ ద్వారా తొలుత పరిశోధకులు విశ్లేషించారు. అనంతరం రోగి రక్తంలోని మూల కణాలను (సీడ్‌ సెల్స్‌) తీసుకొని సెల్‌ థెరపీతో వాటిలో కొన్ని మార్పులు చేస్తారు. తర్వాత క్లోమంలో ప్రభావితం అయిన కణాల స్థానంలో వీటిని (సెల్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌) ప్రవేశపెట్టారు. అలా క్రమంగా రోగికి ఇచ్చే ఇన్సులిన్‌, ఇతరత్రా మందుల మోతాదును తగ్గించారు.

టాటూలతో బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు.. లింఫోమా వచ్చే ముప్పు 21 శాతం వరకూ.. స్వీడన్‌ పరిశోధకులు వెల్లడి

11 వారాల వ్యవధిలోనే ..

2021 జూలైలో తొలుత ఓ రోగికి ఇలా ‘సెల్‌ ట్రాన్స్‌ ప్లాంట్‌’ చేశామని, 11 వారాల వ్యవధిలోనే అతను ఇన్సులిన్‌, ఇతరత్రా మందుల వాడకాన్ని పూర్తిగా మానేశాడని చైనా పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటిస్‌ సంపూర్ణంగా నయమైనట్టు వెల్లడించారు. గడిచిన 33 నెలలుగా సదరు వ్యక్తి ఇన్సులిన్‌ తీసుకోవట్లేదని వివరించారు.

కౌంటింగ్‌ కు ఏపీ సన్నద్ధం.. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్.. స్ట్రాంగ్‌ రూమ్‌ ల వద్ద కట్టుదిట్టమైన చర్యలు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలు.. కౌంటింగ్ రోజున డ్రై డే