ISRO SSLV-D2 Launch Mission: నింగిలోకి దూసుకుపోయిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్, మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్
ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి
ఏపీలోని తిరుపతి జిల్లాలో గల శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 (ISRO SSLV-D2 Launch Mission) మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జానుస్–1, ఆజాదీ శాట్–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక, ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొదటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు.
Here's ANI Video
ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు.
వీధి వ్యాపారులకు శుభవార్త.. డిజిటల్ క్రెడిట్ సేవలు ఈ ఏడాది నుంచే..
Satish Dhawan Space Centre నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువైన భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-07, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మన దేశ విద్యార్థినులు రూపొందించిన 8.7కిలోల బరువైన ఆజాదీ శాట్-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువున్న జానూస్-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు.
అంతకుముందు రాకెట్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది ఆగస్టు 7న ప్రయోగించిన ఎస్‌ఎస్ఎల్వీ తొలి రాకెట్ చివరి నిమిషంలో ఉపగ్రహాల నుంచి సంకేతాలు అందకపోవడంతో విఫలమైంది.