Pyramid Shaped UFO: ఆకాశంలో ఎగురుతున్న ఏలియన్స్, వీడియోను విడుదల చేసిన అమెరికా నేవీ దళ సిబ్బంది, ఏలియన్స్ ఘటనపై స్పందించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ అధికారులు

ఈ వీడియోలో ఏలియన్స్ (Pyramid Shaped UFO) ఆకాశంలో చక్కర్లు కొడుతూ వెళుతుందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Pyramid Shaped UFO (Photo-US Navy Web)

Pentagon, Apil 19: అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే దానిపై దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. మానవ నివాసం లాగే అంతరిక్షంలో కూడా ఏలియన్స్ స్థావరాలు ఉన్నాయని అవి అక్కడ నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాయనే దానిపై చాలా కథలు, సినిమాలు ప్రచారంలో ఉన్నాయి. అగ్రదేశాలు ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే దానిమీద పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ఏలియన్స్ (Pyramid Shaped UFO) ఆకాశంలో చక్కర్లు కొడుతూ వెళుతుందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ మధ్య అమెరికా నౌకాదళ అధికారులు ఓ యుద్ధ నౌక నుంచి తీశారు. అందులో త్రిభుజ ఆకారంలో ఉన్న రెండు ఎగిరేపళ్లాలు వేగంగా వెళ్లాయి.ఈ వీడియోను గ్రహాంతరవాసులపై (Navy's UFO) అధ్యయనం చేస్తున్నవారు విడుదల చేశారు. దీనిపై అమెరికా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ (Pentagon) దీనిపై స్పందించింది. లీకైన ఫోటోలు, వీడియోలను అమెరికా నేవీ దళ సిబ్బంది తీశారని తెలిపింది.

చంద్రయాన్ -3 వచ్చేస్తోంది, 2022 మధ్య నాటికి నింగిలోకి దూసుకు వెళుతుందని చెప్పిన ఇస్రో ఛైర్మెన్ కె శివన్, గగన్‌యాన్ డిజైన్ కూడా తుది దశలో ఉందని చెప్పిన శివన్

అయితే వాటిలో ఉన్న యూఎఫ్‌ఓలే అని మాత్రం చెప్పలేదు. యుఎస్‌ఏ టుడే ప్రకారం.. యుఎస్‌ ప్రభుత్వం యుఎఫ్‌ఓల గురించి వివరణాత్మక నివేదికను జూన్‌ 1న విడుదల చేస్తుందని వారు భావిస్తున్నారు. ఈ వీడియోలు, ఫోటోలను 2020 మే 1న నేవీ ఇంటెలిజెన్స్‌ ఆఫీస్‌ నుంచి లీకయ్యాయి. గత రెండు సంవత్సరాలుగా పెంటగాన్‌ అధికారులు ఏలియన్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. కానీ డైరెక్టుగా గ్రహాంతర వాసులు ఉన్నారు అని మాత్రం ఎక్కడ వెల్లడించలేదు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by JEREMY KENYON LOCKYER CORBELL (@jeremycorbell)

రకరకాల వీడియోల్లో కనిపిస్తూ అకస్మాత్తుగా మాయమవుతున్న ఆ విచిత్రమైన వస్తువులు ఏంటన్నది ఎవరికి అంతుపట్టడం లేదు. దీనిపై పెంటగాన్‌ వాస్తవాలు బయట పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక అమెరికా ఏరియా 51 (Area 51) పేరిట ఎకంగా ఏలియన్స్ స్థావరాన్నే నిర్మించింది. అందులో గ్రహాంతర వాసుల అన్వేషణ చేపడుతోంది. అమెరికాలోని లాస్‌వెలాస్‌ రాష్ట్రానికి దాదాపు 80-125 కిలో మీటర్లదూరంలో నెల్లీస్‌ ఏయిర్‌ ఫోర్స్‌,న్యూక్లియర్‌ టెస్ట్‌ సైట్‌లో ఉందీ ప్రాంతం. ఇందులో అమెరికా ‘బ్లాక్‌ ప్రాజెక్టు' అనే ఎయిర్‌ క్రాఫ్ట్‌ను పరిక్షిస్తోందని సమాచారం.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, వదిలితే అవతల భస్మీ పటలమే, బహుళ లక్ష్యాలపై మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగల ఏకైక సూపర్ సోనిక్ మిసైల్

అయితే ఇందులో ఒక ఎగిరే పళ్లం (యూఎఫ్‌ఓ) కూడా ఉందని చాలా మంది వాదన. రహస్యంగా ఎస్‌ఆర్‌71 అనే ప్రాజెక్టును గ్రూమ్‌ డర్టీ లేక్‌ ప్రాంతంలో పరీక్షిస్తున్నారట. అయితే ఆ ప్రాంతంలో పని చేశానని చెబుతున్న ‘రాబర్ట్‌ లాజర్‌' అనే వ్యక్తి తాను 51, ఎస్‌ 5 ప్రాంతాల్లో పని చేసినట్టు పేర్కొన్నాడు. ఈ రహస్యమయ ప్రాంతం గురించి బయటి ప్రపంచానికి తెలిపిన తొలి వ్యక్తి అతనే.రాస్‌వెల్‌ ప్రాంతంలో ఒక ఫ్టైయింగ్‌ సాసర్‌పై పరిశోధనలు జరిపి గ్రహాంతర వాసుల సాంకెతిక పరిజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నట్టు, అంతే కాకుండా ఆ సాసర్‌లో ఉన్న గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో సంభాషించినట్టు తెలిపాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif