BrahMos: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, వదిలితే అవతల భస్మీ పటలమే, బహుళ లక్ష్యాలపై మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగల ఏకైక సూపర్ సోనిక్ మిసైల్
BRAHMOS Missliles. Representational Image. (Photo Credits: PTI)

Chennai, October 18: ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని (BrahMos, Supersonic Cruise Missile) ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ను ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా.. అది అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో డీఆర్డీఓ తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది.

క్షిపణి అధిక స్థాయిలో చాలా క్లిష్టమైన విన్యాసాలు చేసిన తర్వాత పిన్-పాయింట్ ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని డీఆర్డీఓ ప్రకటించింది. BRAHMOS ‘ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం’ లాగా ఆదివారం ప్రయోగించిన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి (supersonic cruise missile) నౌకాదళం ద్వారా సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను చేధించడం ద్వారా యుద్ధనౌక యొక్క సామర్ధ్యాన్ని పెంచుతుంది.

ఈ ఆయుధంతో ఇండియన్ నేవీ బలం మరింత పెరిగిందని.. ప్రధాన ఆయుధంగా సేవలు అందించగలదని పేర్కొంది. ప్రయోగం విజయవంతమైన సందర్భంగా డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డిని, శాస్త్రవేత్తలను, డీఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. బ్రహ్మోస్ క్షిపణులు భారత సాయుధ దళాల సామర్థ్యాలను అనేక విధాలుగా పెంచుతాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

Here' DRDO Tweet

సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ వ్యవస్థను పొందుపరిచిన బ్రహ్మోస్ క్షిపణులు, పర్వతాలు అడ్డొచ్చిన వేళ, వాటంతట అవే పైకీ, కిందకూ ప్రయాణిస్తూ వెళ్లి లక్ష్యాన్ని ఛేధించగలవు. 75 డిగ్రీల వరకూ వంపు తిరిగి దూసుకు వెళ్లగలవు. దీన్ని 90 డిగ్రీలకు పెంచేందుకు సైంటిస్టులు కసరత్తు చేస్తున్నారు.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి విశేషాలు

ప్రపంచంలోనే ఏకైక, తొలి సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్. దీన్ని విమానం, నౌక, సబ్‌మెరైన్ లేదా ఉపరితలం నుంచి ప్రయోగించవచ్చు. ఇది బహుళ లక్ష్యాలపై కేవలం మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల దీన్ని శత్రుదేశాల రాడార్లు గుర్తించలేవు. సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించడం వల్ల దీన్ని ఏ ప్రతిక్షిపణీ (Anti missile) ఎదుర్కోలేదు.రష్యా సహకారంతో హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో తయారుచేసిన బ్రహ్మోస్-1 వ్యాప్తి 300 నుంచి 500 కి.మీ.లు, వేగం 2.8 మ్యాక్.

భారత్, రష్యా దేశాల్లోని బహ్మపుత్ర, మాస్కోవా నదుల పేర్ల నుంచి 'బ్రహ్మోస్' అనే పేరును రూపొందించారు.అమెరికా టొమహాక్ క్షిపణుల కంటే ఇవి ఎన్నో రెట్లు మేలైనవి. ఉపరితల, సముద్ర రకం బ్రహ్మోస్ క్షిపణులు ఇప్పటికే ఉపయోగించే స్థితిలో ఉన్నాయి. జలాంతర్గామి, వైమానిక క్షిపణి రకాలు శోధన స్థితిలో ఉన్నాయి. పదాతి దళాల కోసం ఉపయోగించే మొబైల్ అటానమస్ లాంచర్(ఎంఏల్ వాహనం)లో మూడు బ్రహ్మోస్ క్షిపణులు, సమాచార, రాడార్ వ్యవస్థలు అమర్చి ఉంటాయి.

దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి

1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం భారతీయ శాస్త్రవేత్తల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. అప్పటివరకు భారత్ కేవలం దీర్ఘవ్యాప్తి, స్ట్రాటజిక్, రక్షణ, టాక్టికల్, బాలిస్టిక్ క్షిపణులపైనే దృష్టిపెట్టింది. కానీ టొమహాక్ క్రూయిజ్ క్షిపణుల సాయంతో అమెరికా ఇరాక్‌ను ఓడించడంతో భారత్ కూడా క్రూయిజ్ క్షిపణులను తయారు చేయాలని నిర్ణయించింది. అబ్దుల్ కలాం నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి ఈ పనిని అప్పగించింది. 1995లో ఐజీఎండీపీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త శివథాను పిళ్లై ఆధ్వర్యంలో భారత్-రష్యా సంయుక్తంగా భవిష్యత్ క్షిపణి బ్రహ్మోస్ రూపకల్పన కార్యక్రమాన్ని ప్రారంభించాయి. శివథాను పిళ్లైని 'బ్రహ్మోస్ పితామహుడిగా' పిలుస్తారు.

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్ బ్లాక్-3 రకాన్ని 2015 మే 9న కార్ నికోబార్ ద్వీపంలో విజయవంతంగా 48వ సారి ప్రయోగించారు.ఈ రెండు స్టేజీల బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ క్షిపణి 2005 నుంచి భారత నావికా దళంలో సేవందిస్తుంది. బహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. 290 కి.మీ. దూరంలోని లక్షాన్ని ఛేదించగల శక్తి దీని సొంతం.

చంద్రునిపై నోకియా 4జీ నెట్‌వర్క్, ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు

ఇక 2016లో 7,500 టన్నుల ఐఎన్‌ఎస్ కోచిని సెప్టెంబర్ 30న భారతీయ నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఆ యుద్ధ నౌక 16 బ్రహ్మోస్ క్షిపణులను మోసుకు పోగలదు. నిట్టనిలువు స్థితిలో లాంచింగ్ చేస్తుంది.భారత వైమానిక బలగాల్లో సుఖోయ్-30ఎంకెలలో మోహరించేందుకు బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.న్యూక్లియర్ క్షిపణిగా అభివృద్ధి చెందిన బ్రహ్మోస్ క్షిపణులు 290 కిలోమీటర్ల వరకూ ప్రయాణించి శత్రువుల భరతం పడతాయి.

సాధారణ సబ్ - సోనిక్ మిసైళ్లతో పోలిస్తే, 9 రెట్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో దాదాపు 4,507 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ఉండగా, దీని వెంట చైనా భారీగా ఆయుధాలను మోహరిస్తోంది.చైనా సైనికులు పలుమార్లు చొరబాట్లకు పాల్పడ్డారు కూడా. వారికి బుద్ధి చెప్పడానికి ఆ సరిహద్దులకు బ్రహ్మోస్ రెజిమెంట్ ను పంపేందుకు బ్రహ్మోస్ రెడీ అయింది.