WhatsApp Ban: ప‌లు దేశాల్లో వాట్సాప్ బ్యాన్, ఈ ఆరు దేశాల్లో వాట్సాప్ వినియోగించ‌డం కుద‌రదు, ఎందుకో తెలుసా?

వాట్సాప్‌ (WhatsApp) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లోని ప్రభుత్వాలు మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ని నిషేధించాయనే విషయం చాలా మందికి తెలియదు.

WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, SEP 12: వాట్సాప్‌ (WhatsApp) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లోని ప్రభుత్వాలు మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ని నిషేధించాయనే విషయం చాలా మందికి తెలియదు.  ఆయా దేశాలు ఎందుకు వాట్సాప్‌ని బ్యాన్‌ (Whatsapp Ban) చేశాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇందులో భారత్‌కు పొరుగుదేశమైన చైనాతో పాటు ఇరాన్‌, యూఏఈ (UAE), ఖతార్‌, సిరియా, ఉత్తర కొరియా ఉన్నాయి. ఈ దేశాలు తమ దేశాల్లో వాట్సాప్ వాడకాన్ని నిషేధించాయి. బ్యాన్‌ వెనుక కారణాలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉన్నాయి. అయితే, ఆయా దేశాలు ఎందుకు వాట్సాప్‌ని బ్యాన్‌ చేశాయో తెలుసుకుందాం.

iPhone 16 Series: యాపిల్ నుంచి ఐఫోన్ 16 సిరీస్.. ధరల శ్రేణి, ఫీచర్స్, బుకింగ్స్ ఇతరత్రా వివరాలు ఇడిగో..! 

ఉత్తర కొరియా

వాట్సాప్‌ని బ్యాన్‌ చేసిన దేశాల్లో ఉత్తర కొరియా (North Korea Ban Whats App) ఒక్కటి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్‌ విధానాలు ఇక్కడ అమలులో ఉన్నాయి. ఉత్తర కొరియాలో సాధారణ ప్రజలకు ఇంటర్‌నెట్‌ వినియోగం పరిమితంగా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం కమ్యూనికేషన్‌పై నియంత్రణను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్‌ సహా పలు యాప్‌ని వినియోగించకుండా నిషేధం విధించారు. తద్వారా స్థానిక సమాచారాన్ని బయటకు వెల్లడికాకుండా సమాచార వ్యాప్తిని అడ్డుకట్ట వేసేలా కిమ్‌ వాట్సాప్‌ని బ్యాన్‌ చేశారు.

చైనా

భారత్‌కు పొరుగుదేశం చైనాలో (China) దాదాపు పరిస్థితి కాస్త ఉత్తర కొరియా తరహాలోనే ఉంటుంది. ఇక్కడ ఇంటర్‌నెట్‌ వినియోగంపై ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుంది. చైనీస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గ్రేట్ ఫైర్‌వాల్ పౌరులు బయటి ప్రపంచానికి సంబంధించిన అనేక విదేశీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది. విదేశీ యాప్‌లకు బదులుగా వుయ్‌చాట్‌ తదితర స్వదేశీ యాప్‌లను ప్రోత్సహించేందుకు చైనా ప్రభుత్వం సమగ్ర వ్యూహంపై పని చేస్తుంది. కమ్యూనికేషన్‌ నియంత్రించడంలో భాగంగా వాట్సాప్‌ని నిషేధించింది.

Aadhaar Card Update: దగ్గర పడుతున్న ఉచిత ఆధార్ అప్డేట్ గడువు, ఈ స్టెప్స్ ఫాలో అయితే ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు 

సిరియా

వాట్సాప్‌ను సిరియాలోనూ నిషేధించారు. సిరియా చాలా కాలంగా అంతర్యుద్ధంతో పోరాడుతోంది. పైగా సిరియాపై అనేక ఆంక్షలు విధించారు. దీని కారణంగా సిరియాలో వాట్సాప్ నిషేధించబడింది. దేశంలో జరిగే విషయాలు బయటికి చేరడం ఇక్కడి ప్రభుత్వానికి సైతం ఇష్టం లేదు. అదే సమయంలో సమగ్ర ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ విధానంలో ఓ భాగంగా వాట్సాప్ నిషేధం కూడా భాగమే.

ఇరాన్‌

ఇరాన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. అణుబాంబు విషయంలో ఇరాన్, అమెరికాల మధ్య వివాదం నడుస్తోంది. దీని కారణంగా వాట్సాప్ ఇరాన్‌లో ఎప్పటికప్పుడు ఆంక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజకీయ అశాంతి దృష్ట్యా కమ్యూనికేషన్, సమాచార వ్యాప్తిని నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం వాట్సాప్‌ను కూడా నిషేధించింది.

ఖతార్‌

ఖతార్ ప్రభుత్వం వాట్సాప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్స్‌ని బ్లాక్‌ చేసింది. కేవలం టెక్స్‌ట్‌ సందేశాలు పంపుకునేందుకు మాత్రమే అవకాశం ఉన్నది. ఖతార్ ప్రభుత్వం తన టెలికాం కంపెనీలకు మద్దతు ఇచ్చేందుకు కాల్స్‌పై నిషేధం విధించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఇటీవలి కాలంలో యూఏఈలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఖతార్ ప్రభుత్వం తరహాలోనే వాట్సాప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్స్‌ను బ్లాక్‌ చేసింది. యూఏఈలో టెక్స్‌ట్‌ మెసేజింగ్‌పై ఎలాంటి నిషేధాజ్ఞలు లేవు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Sankashti Chaturthi 2025 Wishes In Telugu: నేడు సంకష్టహర చతుర్థి సందర్భంగా మీ బంధు మిత్రులకు వినాయకుడి ఆశీర్వాదం అందేలా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..

Kareena Kapoor Khan Releases Statement: చాలా కష్ట సమయంలో ఉన్నాం..దయచేసి అలా చేయొద్దు! సైఫ్‌ అలీఖాన్‌పై హత్యాయత్నం గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్‌

Puppalaguda Murder Case: పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు, ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న మరో ప్రియుడు, కోపం తట్టుకోలేక దారుణంగా..

Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్‌ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

Share Now