Mumbai, SEP 11: . మీ వివరాల కచ్చితత్వాన్ని నిర్ధారించడంతో పాటు మీరు తప్పనిసరిగా ఐడెంటిటీ ప్రూఫ్‌గా పర్మినెంట్ లేదా కరెంట్ అడ్రస్ తప్పనిసరిగా సమర్పించాలి.
ఈ నెల 14 గడువు దాటిన తర్వాత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆలస్యమైన ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 50 జరిమానా విధిస్తుంది. యూఐడీఏఐ సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)కి డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ సమాచారంతో పాటుగా మీ ఆధార్ నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ డేటాబేస్‌లో మీ వివరాల కచ్చితత్వాన్ని అది ధృవీకరిస్తుంది.
మీ ఆధార్ కార్డ్ ఉచితంగా ఎలా అప్‌డేట్ చేయాలి? :
1. ముందుగా, (https://myaadhaar.uidai.gov.in/) వద్ద ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి నావిగేట్ చేయండి. అక్కడికి చేరుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీకు వెంటనే అందే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వండి.
2. లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్‌లో ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ వివరాలను జాగ్రత్తగా రివ్యూ చేయండి.
3. మీ ప్రొఫైల్‌లో చూపిన వివరాలలో ఏదైనా తప్పుగా గుర్తించినట్లయితే. (వివరాలు కచ్చితమైనవి. ‘పైన ఉన్న వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను’ అనే ట్యాబ్‌ను ఎంచుకోవాలి.)
4. అందించిన డ్రాప్-డౌన్ మెను నుంచి వెరిఫైడ్ ప్రయోజనాల కోసం మీరు సమర్పించే నిర్దిష్ట ఐడెంటిటీ ప్రూఫ్ ఎంచుకోండి.
5. వెరిఫై ప్రక్రియకు మీ ఐడెంటిటీ ప్రూఫ్ కాపీని అప్‌లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ఫైల్ సైజు 2MB కన్నా తక్కువగా ఉండాలి. అలాగే, JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో ఉండాలి.
6. డ్రాప్-డౌన్ మెనులో అందుబాటులో ఉన్న ఆప్షన్ల నుంచి అందించాలనుకుంటున్న అడ్రాస్ డాక్యుమెంట్ ఎంచుకోండి.
7. మీ ఆప్షన్ అనుసరించి 2ఎంబీ మించని ఫైల్ సైజుతో అడ్రస్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయండి. JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో ఉండాలి.
ఆధార్ కార్డును ఎందుకు అప్‌డేట్ చేయాలంటే? :
మీ ఆధార్ కార్డ్‌తో అనుబంధించిన సమాచారం లేటుస్టుగా ఉందని నిర్ధారించుకోవడానికి మీ ఆధార్ కార్డ్‌ని తిరిగి వెరిఫై చేసుకోవడం చాలా అవసరం. తద్వారా మీ గుర్తింపును ప్రొటెక్ట్ చేయడం, కీలకమైన సేవలకు యాక్సస్ పొందవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) రీవాలిడేషన్ సమయంలో ధృవీకరణ ప్రక్రియను చేపట్టింది. సమర్పించిన వివరాలను సిస్టమ్‌లో ఇప్పటికే ఉన్న డేటాతో క్రాస్-రిఫరెన్స్ చేస్తుంది. వెరిఫికేషన్ తర్వాత మీ సమాచారం రికార్డులలో అప్‌డేట్ అవుతుంది.
గుర్తించుకోవాల్సిన మరిన్ని విషయాలివే :
1. “ఆధార్ అథెంటికేషన్” అనేది ఒక వ్యక్తిగత నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి జనాభా సమాచారం లేదా వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ సమాచారంతో పాటు యూఐడీఏఐ సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)కి సమర్పించే ప్రక్రియగా చెప్పవచ్చు. ధృవీకరణకు యూఐడీఏఐ డేటాబేస్‌లోని సమాచారం ఆధారంగా సమర్పించిన వివరాల కచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది.
2. వ్యాలిడేట్ అయ్యే పీఓఏ డాక్యుమెంటుతో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఎవరైనా తమ ప్రాంతంలోని ఏదైనా ఆధార్ రిజిస్టర్ సెంటర్ కూడా సందర్శించవచ్చు.
3. మీరు ఏదైనా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ విజిట్ చేయడం ద్వారా ఆధార్‌లోని ఏదైనా జనాభా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
4. ఆధార్ కేంద్రంలో డాక్యుమెంట్లను సమర్పించడానికి మీరు సర్వీసు ఫీజు రూ. 50 చెల్లించాలి. డాక్యుమెంట్ల సమర్పణ కూడా myAadhaar పోర్టల్ ద్వారా చేయవచ్చు.