WhatsApp Voice Calls on Jio Phone: జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త, వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి, KaiOS ఓఎస్‌లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ త‌ప్ప‌ని స‌రి

ఇక‌పై జియో ఫోన్ల‌లో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ (WhatsApp Voice Calls on Jio Phone) చేసుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

jio-phone-users-get-all-one-prepaid-plans-jiophone (Photo Credit: Official Website)

రిలయన్స్‌ జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై జియో ఫోన్ల‌లో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ (WhatsApp Voice Calls on Jio Phone) చేసుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఇక‌పై కైయోస్ ఆపరేటింగ్ సిస్టం(ఓఎస్‌) మోబైల్ వినియోగ‌దారులు కూడా వాయిస్ కాల్స్ (Jio Phone, other KaiOS devices) మాట్లాడుకునేలా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను ఎనేబుల్ చేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్ అప్ డేట్ తో తాజా వెర్షన్ 2.2110.41 తో లభిస్తుంది.

కొత్తగా తెచ్చిన ఈ ఫీచ‌ర్ ను కైయోస్ ఓఎస్ లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ త‌ప్ప‌ని స‌రిగా ఉండాల‌ని వాట్సాప్ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న కైయోస్ ఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట్ ఉన్న ఫోన్లలో ఈ నోటిఫికేష‌న్ చూపిస్తుంది. ఒకవేళ కైయోస్ ఓస్ వినియోగ‌దారులు ఈ ఫీచ‌ర్ ను వినియోగించుకోవాల‌నుకుంటే త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగ‌దారులు త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో, స్నేహితుల‌తో మాట్లాడేందుకు గ‌తంలోకంటే ఇప్పుడు వాట్సాప్ మీద ఆదార‌ప‌డుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగ‌దారులు వాట్సాప్ ను వినియోగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇందులో భాగంగా కైయోస్ ఓఎస్ లో వాట్సాప్ కాల్స్ ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేసిన‌ట్లు వాట్సాప్ సీఓఓ మ్యాట్‌ ఐడెమా తెలిపారు.

వాట్సాప్‌కు కేంద్రం నోటీసులు, కొత్త ప్రైవసీ పాలసీ ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక, నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న సంగతి విదితమే. తన ప్రైవసీ పాలసీని ( WhatsApp's Privacy Policy) యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై ( WhatsApp) విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై తీవ్రస్థాయిలో స్పందించింది. పౌరుల హక్కులకు భంగం కలిగించేలా వాట్సాప్ నూతన ప్రైవసీ విధానం ఉందని పేర్కొంది.

ట్విట్టర్‌కు ఆఖరి ఛాన్స్, భారత నిబంధనల్ని అనుసరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నోటీసుల్లో హెచ్చరించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ

తాజాగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసు పంపించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని (Centre asks WhatsApp to withdraw New privacy policy ) ఈ నోటీసులో స్పష్టం చేసింది. సమాచార సంబంధిత గోప్యత, సమాచార భద్రతల విలువలను బలహీనపరచేదిగా ఈ పాలసీ ఉందని పేర్కొంది. ఈ నోటీసుపై స్పందించేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువులోగా స్పందించకపోతే చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కొత్త విధానంలో వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు ముప్పు ఉందని అభిప్రాయపడింది. నూతన ప్రైవసీ విధానం ( WhatsApp's privacy policy changes) వాయిదా వేసి తప్పించుకోవాలని చూడొద్దని హెచ్చరించింది.