Ukrainian Aircraft Crash: ఉక్రెయిన్ విమానం కూల్చివేత, మానవ తప్పిదమే కారణమన్న ఇరాన్, భారీ నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు, అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఉక్రెయిన్ విమానాన్ని(Ukrainian aeroplane) కూల్చివేయడంపై ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ ( Iranian President Hassan Rouhani ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. దీనిపై తాము ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Ukrainian Aeroplane shot down in Tehran. (Photo Credit: PTI)

Tehran, January 11: ఉక్రెయిన్ విమానాన్ని(Ukrainian aeroplane) కూల్చివేయడంపై ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ ( Iranian President Hassan Rouhani ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. దీనిపై తాము ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ(Ukranian President Volodymyr Zelenskyy) స్పందించారు. జరిగిన ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ జరపాలని, దీనికి కారకులైనవారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. దౌత్య మార్గాల ద్వారా అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన దానికి భారీ నష్టపరిహారం కూడా చెల్లించాలని అన్నారు.

Here's his tweet:

ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా విచారణను ఇరాన్ కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ కు చెందిన ఓ విచారణ బృందం ఇప్పటికే ఇరాన్ లో ఉందని చెప్పారు. 45 మంది నిపుణులతో కూడిన తమ టీమ్ కు ఇరాన్ సహకరించాలని, వారికి కావాల్సిన అన్నింటినీ అందుబాటులో ఉంచాలని కోరారు.

క్షిపణితో ఉక్రెయిన్ బోయింగ్ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్

టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు తొలుత ఇరాన్ విశ్వప్రయత్నాలు చేసింది. కానీ అవన్నీ విఫలమయ్యాయి. చివరకు పొరపాటును ఒప్పుకుంది.

Here are some of the videos and tweets shared by TIME and NYT journalists:

మానవ తప్పిదంతో (human error' and 'accidental)క్షిపణులను ప్రయోగించడం వల్లే..దురదృష్టవశాత్తు ఉక్రెయిన్ విమానం కూలిపోయిందని దర్యాప్తులో తేలిందని రౌహానీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షమించరాని తప్పిదం కారణంగా 176 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తామని ప్రకటించారు.

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, త్వరలో అణుయుద్ధం?

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ విచారం వ్యక్తం చేస్తోంది..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్ (Iran Foreign Minister Javad Zarif)కూడా స్పందించారు.

ట్రంప్ తల తీయండి..రూ.570 కోట్లు గెలుచుకోండి

అమెరికా వల్ల తలెత్తిన సంక్షోభం..మానవ తప్పిదం కారణాల వల్ల ఈ ఘోరం జరిగిందని తెలిపారు. విమాన ప్రమాదంలో చనిపోయిన ఇరాన్, ఇతర దేశాల మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబతున్నట్లు ఆయన తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now