Soleimani Killing Consequences: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, త్వరలో అణుయుద్ధం? దేశాల అణుఒప్పందాల కట్టుబాట్లను తెంచుకుంటున్న ఇరాన్, యురేనియం సెంట్రిఫ్యూజ్‌లపై పరిమితి ఎత్తివేత, ప్రతిదాడి తప్పదంటున్న అమెరికా
US President Donald Trump, Iranian counterpart Hassan Rouhani (Photo Credits: PTI)

Tehran, January 6: ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసిం సులేమాని (Qaseem Soleimani)ని అమెరికా దళాలు చంపినందుకు (US Killing) దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఇరాన్ సిద్ధమవుతుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే యుద్ధమేఘాలు ఆవరించాయి. తమపై దాడి చేసిన ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ప్రతీకారేచ్ఛతో ఇరాన్ (Iran) రగిలిపోతుంది. ఈ క్రమంలో 2015లో దేశాల మధ్య కుదిరిన అణుఒప్పందంలోని పరిమితుల (nuclear deal limits) కు ఇకపై తాము కట్టుబడి ఉండబోమని ఇరాన్ ప్రకటించింది. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయి పెంచుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్ లపై ఉన్న పరిమితులను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇటు ఇరాక్ పార్లమెంట్ కూడా తమ ఇరాక్ నేలపై అమెరికన్ దళాలను బహిష్కరించాలని తీర్మానం చేసింది. అదే అమలైతే ఐఎస్ఐ ఉగ్రవాదులను ఏరివేయటానికి ఇరాక్ లో మకాం వేసిన అమెరికా దళాలకు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుంది, తద్వారా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (Islamic State Group)  తిరిగి బలపడే అవకాశాలు ఉంటాయి. ఇంతకాలం ఉగ్రవాద ఏరివేతకు అమెరికా చేసిన ప్రయత్నాలన్నింటికి గండి కొట్టినట్లే. వేగంగా మారుతున్న ఈ పరిణామాలన్నీ అణుయుద్ధానికి దారి తీసే స్పష్టమైన సంకేతాలను పంపింస్తున్నాయి. ఇరాన్ - యూఎస్ పరస్పర హెచ్చరికలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవబోతుందా?

ఇరాన్ చరిత్రలో తొలిసారిగా పవిత్ర జంకరాన్ మసీదు (Jamkaran Mosque)పై ఎర్రజెండా ఎగరేశారు. వారి మత విశ్వాసం ప్రకారం, ప్రార్థనాస్థలంపై ఎర్రజెండాను ఎగరవేయడమంటే శత్రునాశనం చేసే సమయం ఆసన్నం అయిందని చెప్పే అతితీవ్రమైన హెచ్చరిక, ముస్లిం సమాజం అంతా సైతాన్ పై యుద్ధానికి సిద్ధం అయినట్లు శపథం చేస్తున్నట్లు ప్రతీక.

Unfurls Red Flag- Video Below

ఆదివారం ఇరాన్ లోని అహ్ వాజ్ నగరంలో జరిగిన సులేమాని అంతిమయాత్రలో లక్షల మంది పాల్గొన్నారు. సుమారు 13 లక్షల మంది అతడి అంతిమయాత్రలో పాల్గొన్నట్లు ఒక అంచనా. వారంతా తమ నాయకుడికి సంతాపం ప్రకటిస్తూ ప్రతీకారం తీర్చుకుంటామని నినాదాలు చేస్తూ కదిలారు. ఓ ఇరానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలనరికిన వారికి 80 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించడం పట్ల అక్కడ ఉద్రిక్తతలు, భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Solemani’s Funeral Procession:

అయితే, ఈ ఉద్రిత్రక్తలకు తోడు యూఎస్ ప్రెజిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. యూఎస్ దళాలను బహిష్కరించాలని ఇరాక్ పార్లమెంట్ తీర్మానాన్ని ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాక్ లో అమెరికా బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది, ఆ మొత్తం తిరిగి ఇచ్చేందుకు అక్కడ్నించి కదిలేది లేదు అని తేల్చి చెప్పారు. ఒకవేళ బలవంతంగా యూఎస్ దళాలను పంపిస్తే అది స్నేహపూర్వక వాతావరణంలో జరగదని, ఇరాక్ పై భారీ ఆంక్షలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

సులేమానిని చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఎలాంటి దాడి చేసినా, అమెరికా నుంచి అంతకుమించి ప్రతిదాడి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.