Iran: ప్రమాదమా? పొరపాటున కూల్చివేశారా? టెహ్రాన్‌లో కుప్పకూలిన ప్యాసింజర్ విమానం, 170 మంది మృతి, ప్రమాదంపై అనుమానాలు, ఆ మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని భారతీయులకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక
Representational image | (Photo Credits: Getty Images)

Tehran, January 8:  ఇరాన్ (Iran) దేశ రాజధాని టెహ్రాన్‌లో బుధవారం తెల్లవారుఝామున ఘోరవిమాన ప్రమాదం (Plane Crash) చోటు చేసుకుంది. 170 మందితో ప్రయాణిస్తున్న ఉక్రేనియన్ ప్యాసింజర్ విమానం (Ukrainian passenger plane) కూలిపోవడంతో అందులోని ప్రయాణికులు మొత్తం మరణించారు. మృతుల్లో 161 మంది ప్రయాణికులు కాగా, 9 మంది సిబ్బంది ఉన్నారు. ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయం (Imam Khomeini International Airport) నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే మంటలు వ్యాపించి విమానాశ్రయానికి సమీపంలోనే కుప్పకూలింది. విమానం నేలను తాకగానే పేలిపోయి పెద్దగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఉన్నవారంతా సజీవ దహనమైనట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా తునతునకలయి, శకలాలు విసిరివేయబడ్డాయి.

సాంకేతిక కారణాలతోనే ప్రమాదం జరిగిందని ఇరాన్ మీడియా పేర్కొంది. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటి తర్వాత దానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఆ వెంటనే కూలిపోయిందని చెబుతున్నారు. అయితే ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Here's the visual:

 

పశ్చిమ ఇరాక్‌లోని రెండు యుఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతీకారంతో వైమానిక దాడులు చేసిన కొద్దిసేపటికే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  ఇరాన్ దాడికి, యూఎస్ ప్రతిదాడి చేస్తుందేమోనని ఊహించి, పొరపాటున ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ ప్యాసెంజర్ విమానాన్ని కూల్చివేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దాడిలో 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' హతం అయ్యారని పేర్కొన్న ఇరాన్ 

అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. సాంకేతిక లోపమేనంటూ అధికారులు చెబుతున్నారు.

భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

 

ఇరాన్- యూఎస్ ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీచేసింది. ఇరాక్- ఇరాన్ మరియు గల్ఫ్ గగనతలంలో ప్రయాణించరాదని ఆదేశించింది. అలాగే భారత పౌరులు ఇరాక్ వెళ్లకపోవడం మంచిది అని తెలిపింది. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇరాక్‌కు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అంతేకాకుండా ఇరాక్‌లో ఉండే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయట తిరగకూడదని హెచ్చరించింది. ఎలాంటి సమస్య తలెత్తినా బాగ్ధాద్, ఎర్బిల్‌లోని ఇండియన్ ఎంబసీలను ఆశ్రయిస్తే అన్ని విధాల సహాయం అందుతుందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.  ఇరాక్‌లో సుమారు 25 వేల మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నట్లు ఒక అంచనా