Tehran, January 6: అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ మేజర్ జనరల్ కసీమ్ సోలెమన్(Iranian Major General Qaseem Soleimani) యొక్క అంత్యక్రియలు( funeral ceremony) సోమవారం జరిగాయి. మషద్ నగరంలో (Mashhad city)జరిగిన ఊరేగింపులో ఓ వీడియో (Video) సంచలనం రేపుతోంది. ఈ వీడియో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను(US President Donald Trump) హతమార్చిన వారికి రూ. 80 మిలియన్ డాలర్లు (రూ. 570 కోట్లు) గెలుచుకోవచ్చని చెబుతోంది. కాగా ఇరాన్ అధికారిక ఛానల్ ఈ ప్రకటన చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉద్రికత్తలను మరింతగా రేపుతోంది.
అమెరికా అధ్యక్షుడి తలను(US President’s head) తీసుకురావడానికి అందరూ తలా ఒక డాలర్ కేటాయించాలని వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోని ఎవరో ట్విట్టర్లో షేర్ చేశారు.
Here's the Video:
At Solemani’s funeral procession in Mashad one of the organisers called on all Iranian to donate $1 each in order to gather an $80million bounty on President Trumps head. pic.twitter.com/Qb7AAfAiww
— Ali Arouzi (@aliarouzi) January 5, 2020
ఇరాన్ జనాభా 80 లక్షలు కావడంతో ట్రంప్ తలను కూడా 80 మిలియన్ డాలర్ల కింద వెలకట్టినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ తల నరికి తెచ్చిన వారికి రివార్డు ప్రకటించినట్లు..mirror.co.uk రిపోర్టు వెల్లడించింది.
52 సైట్లను భస్మీ పటలం చేస్తాం: అమెరికా
కాగా ఈ ప్రకటనతో అమెరికా - ఇరాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉంది. ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీం సోలెమన్‌ను హత్యకు ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ దేశం మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై 2020, జనవరి 03వ తేదీ శుక్రవారం అమెరికా దాడులు(US airstrike) జరిపింది.
3వ ప్రపంచ యుద్ధం ఆసన్నమైందా..?
టాప్ సైనిక కమాండ్ జనరల్ ఖాసీం సోలెమన్, ఇరాక్ మిలీషియా కమాండర్ అబూ మహదీ అల్ ముహండీస్‌లు ఈ దాడిలో చనిపోయారు. ఈ ఘటనతో ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వెంటనే జరిగిపోయాయి.
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా విజృంభిస్తోంది. ఇరాన్ తమపై దాడికి పాల్పడితే..మాత్రం..మునుపెన్నడు లేనిస్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అక్కడ 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను తాము గుర్తించడం జరిగిందని, దాడి చేస్తే..ఆ ప్రాంతాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. దీనిపై ఇరాన్ ఎంపీ అబోల్ఫాజ్ తీవ్రంగా స్పందించారు. వైట్ హౌస్‌పై దాడి చేయగలమని మిర్రర్.కో.యుకే..ఉటంకిస్తూ వెల్లడించారు. తమకూ శక్తి ఉందని తగిన సమయంలో తాము ప్రతిస్పందిస్తామని తెలిపారు.