US Drone Attack: ఇరాక్, సిరియాలోని ఇరాన్ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా బాంబుల మోత.. యుద్ధ విమానాలు, డ్రోన్లతో ప్రతీకార దాడులతో విరుచుకుపడ్డ అగ్రరాజ్యం

మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు దాడులకు దిగాయి.

US Drone Attack (Credits: X)

Newyork, Feb 3: ఇరాన్ (Iran) మిలిటెంట్లపై అమెరికా (America) ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది.  మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఇరాక్ (Iraq), సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్రవాద స్థావరాలు, ఇరాన్ రివల్యూషనరీ గార్డులను లక్ష్యంగా చేసుకుని అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు దాడులకు దిగాయి. నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగినట్టు తెలిపింది. ఈ వైమానిక దాడిలో దీర్ఘశ్రేణి బాంబర్లు పాల్గొన్నాయి.

IND Vs Nepal: అండ‌ర్ -19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ కు చేరిన భార‌త్, సూప‌ర్ సిక్స్ లోనూ ఆగ‌ని టీమిండియా విజ‌యాల ప‌రంప‌ర‌

అసలేం జరిగిందంటే?

జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇటీవల ఇరాన్ ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బైడెన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై ప్రతీకార దాడులు తప్పవని అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. అన్నట్టుగానే శత్రు స్థావరాలపై అమెరికా బాంబర్లు విరుచుకుపడ్డాయి. కాగా, అమెరికా దాడిలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Bandi Sanjay: ఫిబ్ర‌వ‌రి 2వ తారీఖు కూడా అయిపోయింది! కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ హెచ్చ‌రిక‌, గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ఏమైందంటూ నిల‌దీత‌



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif