Hyderabad, FEB 02: తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ఫిబ్రవరి 1 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాలను (Group -1) ఉంటాయని హామీ ఇచ్చారని అన్నారు. అందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారని బండి సంజయ్ అన్నారు.
Today’s Date : 2-2-2024
What happened to the Group1 appointments?
Congress government in its Abhaya Hastham Manifesto promised Group1 appointments on 1st February.
We waited for a day to see if govt will make any announcement, but typical Congress DNA of cheating people has… pic.twitter.com/J4EZSpCWCh
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 2, 2024
ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన గ్రూప్ -1తో పాటు గ్రూప్-2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.