CM KCR Speech (Photo-Twitter)

Hyderabad, March 23: ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ (TRS) భగ్గుమంది. పెట్రోల్(Petrol), డీజిల్(Diesel), గ్యాస్ (Gas)ధరల పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ (KCR) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళనలు (protests ) చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో జ‌ర‌గ‌నున్న ఈ నిTRSర‌స‌న‌ల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోవాల‌ని, నిర‌స‌‌నల‌ను హోరెత్తించాల‌ని ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్ప‌టికే యాసంగిలో పండే మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వాదిస్తున్న కేసీఆర్‌ (KCR).. తాజాగా ధ‌ర‌ల పెరుగుద‌ల అంశంపై కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన‌ట్లుగా రాజకీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

అటు వరుసగా రెండో రోజూ ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల పాటు బ్రేక్ తీసుకున్న దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి చడీచెప్పుడు కాకుండా ధరల పెంపును ప్రారంభించేశాయి. బుధవారం కూడా లీటర్ పెట్రోల్ పై 90పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 72 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదు

ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు జీవనం రోజు రోజు భారంగా మారుతోంది.చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ బేసిక్ ధరతో పోల్చితే వసూలు చేసే ట్యాక్సులే (Taxes) అధికంగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నాయి.

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, తొలివిడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ, గ్రూప్‌-1లో 503 పోస్టుల భర్తీకి అనుమతి..

రాష్ట్రాలే అధికంగా ట్యాక్సు వసూలు చేస్తున్నాయని కేంద్రం ఆరోపిస్తుంటే… ధరల నియంత్రణ కేంద్రం చేతుల్లోనే ఉందంటూ రాష్ట్రాలు ప్రతి విమర్శ చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. జీఎస్టీ పరిధిలో లేనందునే ధరలు పెరుగుతున్నాయన్న వాదన కూడా ఉంది. అయితే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదని కేంద్రం చెబుతోంది.