Hyderabad, Dec 14: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయంశమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం అరెస్టై నిన్న రాత్రంతా చంచల్ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపిన అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం ఉదయం 6.35 గంటల ప్రాంతంలో ఎట్టకేలకు విడుదల అయ్యారు. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి బన్నీని అధికారులు పంపించారు. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు నిన్న సాయంత్రం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు (Allu Arjun Bail) చేసిన విషయం తెలిసిందే.
దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వర్మ నాలుగు ప్రశ్నలు
Here's Video:
జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు@alluarjun #AlluArjun #AlluArjunArrested #Bigtv pic.twitter.com/DfJHClaVEI
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024
జైలులో ఇలా..
అయితే, హైకోర్టు ఉత్తర్వులు అందడంలో జాప్యం, బెయిల్ కాపీ హార్డ్ కాపీ కోసం అధికారులు అడగడంతో నిన్న బన్నీ విడుదల ఆలస్యమైంది. దీంతో రాత్రంతా చంచల్ గూడ జైలులోని మంజీరా బ్లాక్ లోనే బన్నీ గడిపారు. జైలు గదిలో బన్నీని ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్ లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్టు సమాచారం. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా అర్జున్ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
అసలేమైంది??
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.