Allu Arjun-Banothu Raju Naik (Credits: X)

Hyderabad, Dec 14: నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల (Allu Arjun Released) అయ్యారు. విడుదలైన వెంటనే బన్నీ ఇంటికి వెళ్తారని అంతా భావించారు. అయితే, ఆయన ఎస్కార్ట్ వాహనంతో, భారీ భద్రత నడుమ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు చేరుకున్నారు. కాగా, అల్లు అర్జున్ ను నిన్న అరెస్టు చేసిన పోలీసు అధికారి సీఐ బానోతు రాజు నాయక్ అని తెలిసింది. ఆయన బన్నీకి వీరాభిమాని అని కొందరు చెప్తున్నారు. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

జైలు నుంచి డైరెక్టుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు అల్లు అర్జున్.. కార్యాలయానికి క్యూకట్టిన పలువురు సినీ ప్రముఖులు

అసలేమైంది??

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా జైలులో ఉంచారు.

అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..