India
Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చరర్ని చితకబాదిన తల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన
Team Latestlyప్రకాశం జిల్లాలోని నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న బక్కమంతుల వినయ్ అనే లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లివిరిశాయి. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడన్న సమాచారం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కళాశాలకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చరర్ని పట్టుకుని చితకబాదారు.
Hong Kong Fire: హాంకాంగ్ అగ్నిప్రమాదంలో 94కు చేరిన మృతులు సంఖ్య, ఏడు భవనాలకు అంటుకున్న మంటలు, గత 60 ఏళ్లలో ఇదే భారీ అగ్నిప్రమాదం
Team Latestlyహాంకాంగ్‌లోని ఓ ఎత్తైన భవన సముదాయంలో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. 200 మందికి పైగా వ్యక్తులు ఇంకా కనుగొనబడలేదని సమాచారం. 72 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Allahabad High Court: భర్త నిరుద్యోగి అయినా భార్యకు భరణం చెల్లించాలల్సిందే, కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..
Team Latestlyభార్యకు పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యతను భర్త నిరుద్యోగం అనే కారణంతో తప్పించుకోలేడని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. శారీరకంగా పనిచేయగలిగే స్థితిలో ఉన్న భర్తకు ఆదాయం లేకపోవడం సరైన నెపంగా పరిగణించబడదని కోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.
Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు
Team Latestlyప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్లైన్ ఫుడ్ & ట్రావెల్ ప్లాట్ఫార్మ్ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.
Hong Kong Tai Po Apartment Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదంపై సంచలన విషయాలే, 55 మందికి పైగా మృతి, కిటికీల వద్దే సిగరెట్ పీకల వల్లే మంటలు ఎగసాయా..
Team Latestlyహాంకాంగ్‌ను విషాదంలో ముంచెత్తిన భయంకరమైన అగ్నిప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. నగరంలోని ఒక ప్రముఖ హౌసింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న ఆకాశాన్ని తాకే అట్టడుగు భవనాల్లో విపరీతంగా చెలరేగిన మంటల్లో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గత ఆరు దశాబ్దాల్లో ఇదే అత్యంత పెద్ద అగ్ని ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు.
Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ
Team Latestlyఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు.
Visakhapatnam: కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య, వరుడి కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం శూన్యం, వాట్సాప్‌లో బంధువులకు సూసైడ్ నోట్ పంపిన మృతుడు
Team Latestlyకూతురు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందన్న ఆవేదనను తట్టుకోలేక ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం రద్దయిందన్న షాక్ నుంచి బయటపడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
Hyderabad: ట్రాఫిక్ డ్యూటీలో రౌడీషీటర్లు, రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం, తొలి దశలో 60 మందికి బాధ్యతలు, మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యమన్న కమిషనర్
Team Latestlyసమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
India vs South Africa: దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌కు ఘోర పరాభవం, రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 2–0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న సఫారీలు
Team Latestlyదక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌటైంది.
Curry Leaves benefits: కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు, మధుమేహం కంట్రోల్లో రావాలన్నా, హానికరమైన ఎల్డిఎల్ తగ్గాలన్నా కరివేపాకును మించినది లేదంటే నమ్మగలరా..
Team Latestlyకరివేపాకు.. మన రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యే ఈ ఆకులకు రుచి, వాసన మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చాలా మంది ఇది కేవలం సువాసనకే ఉపయోగిస్తారని భావించి, వడ్డించినప్పుడు పక్కకు తొలగిస్తారు. కానీ కరివేపాకుల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక గుణాలు దాగి ఉన్నాయి.
Thane Shocker: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన
Team Latestlyమహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Team Latestlyహైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.
Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.
Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఒక విషాదకరమైన సంఘటనలో, ఒక జంట హల్ది వేడుకలో వారి ప్రవేశానికి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బెలూన్లు పేలిపోవడంతో వధూవరులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Delhi Dog Attack: షాకింగ్ వీడియో ఇదిగో, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన పిట్‌బుల్ కుక్క, తలకు తీవ్ర గాయాలు, కుక్క యజమాని అరెస్ట్
Team Latestlyఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో ఆరేళ్ల బాలుడిపై పిట్‌బుల్ కుక్క దాడి చేసి ఘటన వెలుగుచూసింది. ఆదివారం జరిగిన ఈ సంఘటన బాలుడి ఇంటి ముందు ఉన్న సీసీటీవీలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో బాలుడు బంతితో ఆడుకుంటూ బయటకు వస్తుండగా, పొరుగింటి పెంపుడు పిట్‌బుల్ అకస్మాత్తుగా వచ్చి అతనిపైకి దూకిన దృశ్యాలు కనిపిస్తున్నాయి
Tirumala Token Booking: డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, నవంబర్ 27 నుంచి ఆన్లైన్లో టోకెన్ల రిజిస్ట్రేషన్, సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. తొలి మూడు రోజులు సర్వదర్శనానికే
Team Latestlyడిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు మొత్తం 10 రోజులు భక్తులకు వైకుంఠ ద్వారాల ద్వారా స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ భక్తుల సౌకర్యం దృష్ట్యా పలు కీలక మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు.
'No Religious Rituals on Duty': డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు, తెలంగాణ పోలీసు శాఖ కీలక ఆదేశాలు, ముందస్తుగా సెలవుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచన
Team Latestlyతెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షల్లో పాల్గొనే విషయంలో కొత్తగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. అయ్యప్ప దీక్ష వంటి ఆచారాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది డ్యూటీకి హాజరుకావద్దని, తప్పనిసరిగా ముందస్తు సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.
Weather Alert: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, నేడు వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Team Latestlyదక్షిణ అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడన స్థాయిలో ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది
Justice Surya Kant: భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం, జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానంలో నియామకం, 15 నెలలు పాటు పదవిలో కొనసాగనున్న కాంత్
Team Latestlyజస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (CJI) నవంబర్ 24, సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ బి. ఆర్. గవాయ్ స్థానాన్ని ఆయన భర్తీ చేసారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన పదవీకాలం దాదాపు 15 నెలలు ఉండనుంది.
Pakistan Suicide Blast: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి లైవ్ వీడియో ఇదిగో, పారామిలిటరీ ఫోర్స్ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు దాడి, ఇద్దరు FC కమాండోలు మృతి
Team Latestlyనవంబర్ 24, సోమవారం ఉదయం పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ (FC) ప్రధాన కార్యాలయంపై ముష్కరులు ఆత్మాహుతి దాడి చేశారు. ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు FC కమాండోలు, ముగ్గురు దాడి చేసిన వ్యక్తులు సహా మొత్తం ఐదుగురు మరణించారు.