IPL Auction 2025 Live

Three Capital Petitions: బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని వెల్లడి, తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కి వాయిదా

ప్రస్తుత దశలో వాటిని విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

High Court of Andhra Pradesh | (Photo-Twitter)

Amaravathi, January 24: ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ (Three Capitals) , సీఆర్డీఏ (CRDA) ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత దశలో వాటిని విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆ బిల్లులపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26 కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?

ఈ బిల్లుల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలన్న వ్యాజ్యాలపై ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మండలిలో జరిగిన పరిణామాల గురించి హైకోర్టు ఆరాతీసింది. దీనికి అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం వెలువరించేంత వరకు వేచిచూడాలని పిటిషనర్లకు స్పష్టంచేసింది.

సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పందిస్తూ.. బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చలేదని.. వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు అపరిపక్వమైనవని కోర్టుకు వివరించారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి పంపిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ గురించి బిజినెస్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది.

3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు మూడు నెలల గడువు ఉందని ముకుల్‌ రోహత్గీ వివరించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించిన కోర్టు అప్పటి వరకు ఆగాలని పిటిషనర్లకు సూచించింది.

అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది అశోక్‌భాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఆ రెండు బిల్లులకు గవర్నర్‌ అనుమతి అవసరమని, అయితే గవర్నర్‌ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనికి రోహత్గీ సమాధానమిస్తూ ఆ బిల్లులు ద్రవ్యబిల్లులు కాదని స్పష్టంగా చెప్పామని, అలాంటప్పుడు ద్రవ్యబిల్లుకు వర్తించే రాజ్యాంగ నిబంధనలను ప్రస్తావించడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. అశోక్‌భాన్‌ జోక్యం చేసుకుంటూ, బుధవారం అడ్వొకేట్‌ జనరల్‌ ఈ రెండింటిని అధికరణ 207 కింద సాధారణ బిల్లులుగా చెప్పారన్నారు.

3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్

ఈ నేపథ్యంలో అశోక్ భాన్‌ వాదనను ధర్మాసనం ఖండించింది. సాధారణ బిల్లులని మాత్రమే ఏజీ చెప్పారని, అధికరణ 207 కింద బిల్లులని చెప్పలేదని స్పష్టం చేసింది. వ్యాజ్యాలు తేలేంత వరకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని అశోక్‌భాన్‌ కోరారు. వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా, ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తే.. ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసునని ధర్మాసనం పేర్కొంది.



సంబంధిత వార్తలు

SC Dismisses Plea for Ballot Paper: పేప‌ర్ బ్యాలెట్‌తో ఎన్నిక‌లు నిర్వాహించాలనే పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు, విచారణలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు