India Lockdown: ఆ వార్తలను నమ్మకండి, 21రోజుల తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు అంతా పుకారు, కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వెల్లడి
లాక్‌డౌన్ గడువు పెంచుతారన్న వదంతులు ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా (Cabinet Secretary Rajiv Gauba) స్పందించారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్ 21 రోజులేనని స్పష్టం చేశారు.
New Delhi, Mar 30: ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతున్న కోవిడ్ -19 (COVID-19 Outbreak) మహమ్మారి ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. దేశాలకు దేశాలే నిర్భంధంలోకి వెళుతున్నాయి. లాక్ డౌన్ ( lockdown) విధించుకుని ప్రజలను ఇళ్లకు పరిమితం చేశాయి. ఇండియా కూడా 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (21 days lockdown) విధించింది. అయితే దీన్ని పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపే కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
కరోనా వైరస్ (Coronavirus) నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్ గడువు పెంచుతారన్న వదంతులు ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా (Cabinet Secretary Rajiv Gauba) స్పందించారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్ 21 రోజులేనని స్పష్టం చేశారు.
Here's PIb Tweet
లాక్‌డౌన్ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 21 రోజుల దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేయడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవాలని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు.
వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి
ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మరోసారి లాక్‌డౌన్ గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణ కోరారు. కరోనాను అదుపు చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదని, ప్రజలు తనను తప్పకుండా క్షమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 30 మంది మృత్యువాత పడ్డారు.