Coronavirus Updates: దేశంలో రెండు కొత్త కరోనా స్ట్రెయిన్లు, కలవరపెడుతున్న యూకే వేరియంట్, ఒకే బిల్డింగ్‌లో 100 మందికి పైగా కోవిడ్, దేశంలో తాజాగా 11, 610 కేసులు, ఏపీలో 60 కొత్త కేసులు

అదే స‌మ‌యంలో 11,833 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు (Coronavirus Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi,Feb 17: దేశంలో గత 24 గంటల్లో 11,610 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,833 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,37,320కు (Coronavirus Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,913కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. 1,36,549 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 89,99,230 మందికి వ్యాక్సిన్ వేశారు.

మ‌న దేశంలోకి రెండు కొత్త క‌రోనా స్ట్రెయిన్ కేసులు (New Covid Strains) వ‌చ్చాయి. న‌లుగురికి సౌతాఫ్రికా వేరియంట్ క‌రోనా సోక‌గా, ఒక‌రికి బ్రెజిల్ వేరియంట్ సోకిన‌ట్లు ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. విదేశాల నుంచి వ‌చ్చిన ఈ ఐదుగురినీ క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పింది. ఇప్ప‌టికే యూకే వేరియంట్ కేసులు 187 ఉన్న‌ట్లు కేంద్రం తెలిపింది. సౌతాఫ్రికా వేరియంట్ 41 దేశాల‌కు, యూకే వేరియంట్ 82 దేశాల‌కు వ్యాపించింది.

మరో కొత్త షాక్, డిసెంబర్‌కు ముందే చైనాలో కరోనా, వుహాన్‌లో 13 రకాల కోవిడ్ స్ట్రెయిన్లు, SARS-COV-2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

కొవిడ్‌-19పై భారత్‌ చేపట్టిన సమిష్టి పోరు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ప్రపంచ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోందని, కరోనా వైరస్‌ అనంతరం ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచం దృష్టిసారించిందని చెప్పారు. మంగళవారం శ్రీ రామ్‌చంద్ర మిషన్‌ వజ్రోత్సవాల సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారత్‌ పవిత్ర గ్రంధాల్లో ప్రవచించిన బోధనలకు అనుగుణంగా మానవత్వం పట్ల తనదైన శ్రద్ధ కనబరుస్తుందని చెప్పారు. ఐరోపా, అమెరికా జనాభా కంటే ఎక్కువ మంది భారత్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందారని చెప్పారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని ప్రధాని అభివర్ణించారు.

కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా

దేశంలో ఇప్పటి వరకు 87లక్షలకుపైగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) మోతాదులను ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 87.40లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, ఇందులో 85.70 వ్యాక్సిన్‌ మొదటి విడుత డోసనీ, రెండో విడత మోతాదు 1.70లక్షల మందికి ఇచ్చినట్లు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ రోజురోజుకు వేగవంతమవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ పేర్కొన్నారు. అలాగే 14 రాష్ట్రాలు 70 శాతం మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి టీకాలు అందించే ప్రక్రియను పూర్తిచేశాయన్నారు. అయితే ఢిల్లీ 42 శాతం మంది వైద్య సిబ్బందికి మాత్రమే టీకాలు వేసిందని తెలిపారు. పది రాష్ట్రాలు కేవలం పది శాతం మంది సిబ్బందికే టీకాలు పంపిణీ చేశాయని పేర్కొన్నారు.

కరోనాతో రెండు తెల్ల పులి పిల్లలు మృతి, బాగా పాడైపోయిన పులి పిల్లల ఊపిరితిత్తులు, జూలో పని చేసే 6 మంది సిబ్బందికి కోవిడ్, పాకిస్తాన్ జూలో విషాద ఘటన

తెలంగాణలో కొత్త‌గా 148 కరోనా కేసులు (Telangana Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 150 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,93,690 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,620 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,640 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 641 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 26 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 24,311 కరోనా పరీక్షలు నిర్వహించగా 60 మందికి పాజిటివ్ (Andhra Pradesh Covid) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 16 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. కృష్ణా జిల్లాలో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. విజయనగరం, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,959 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,181 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 615 మంది చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 7,163గా నమోదైంది.

వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులకు కరోనా, ఐసోలేషన్‌కు వెళ్లిన ముగ్గురు డాక్టర్లు, హిమాచల ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో ఘటన

బెంగళూరులో బహుళ అంతస్తు భవనంలో ఏకంగా 100 మందికిపైగా కరోనా బారినపడ్డారు. అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ప్రైవేట్‌ పార్టీ భవనంలో ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. బెంగళూర్‌ మున్సిపాలిటీ బొమ్మనహల్లి జోన్‌ పరిధిలోని బిలేకహల్లి ప్రాంతంలో ఎస్‌వీవీ లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో సుమారు 435 ప్లాంట్లలో 1500 మంది నివసిస్తున్నారు. ఈ నెల 6న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో ప్రైవేట్‌ పార్టీ నిర్వహించగా 45 మంది హాజరయ్యారు. ఈ నెల 10న వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.అప్రమత్తమైన స్థానిక మున్సిపల్‌ అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించగా మంగళవారం వరకు డ్రైవర్లు, పని మనుషులు, వంట మనుషులతో సహా 103 మందికి పాజిటివ్‌ వచ్చింది.

ముంబైలో మళ్లీ లాక్‌డౌన్? ప్రజలు అప్రమత్తంగా లేకుంటే తప్పదని తెలిపిన ముంబై నగర మేయర్ కిషోరి పండేకర్, దేశ ఆర్థిక రాజధానిలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

కరోనా బారినపడిన వారిలో చాలామందికి లక్షణాలు లేవని అధికారులు పేర్కొన్నారు. కరోనా బారినపడిన వారిలో చాలామంది యువతేనని వీరిని క్వారంటైన్‌కు పంపామని, భవనాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశామని వెల్లడించారు. ఆదివారం సుమారు 513 మందికి, సోమవారం మరో 600 మందికి, సోమవారం మరో 300 మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం బ్రిహాన్‌ బెంగళూర్‌ మున్సిపల్‌ సీనియర్‌ అధికారులు అపార్టమెంట్‌ను సందర్శించి నివాసితులు పాటించాల్సిన నిబంధనలపై అపార్ట్‌మెంట్‌ కార్యదర్శి, సిబ్బందితో చర్చించారు.



సంబంధిత వార్తలు