Tiger Cubs Dies with Corona: కరోనాతో రెండు తెల్ల పులి పిల్లలు మృతి, బాగా పాడైపోయిన పులి పిల్లల ఊపిరితిత్తులు, జూలో పని చేసే 6 మంది సిబ్బందికి కోవిడ్, పాకిస్తాన్ జూలో విషాద ఘటన
File Image of White Tiger (Photo Credits: Pixabay)

Lahore, Feb 13: కోవిడ్ భారీన పడి మనుషులే కాదు..జంతువులు కూడా చనిపోతున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడిన రెండు తెల్ల పులులు మృతి (Tiger Cubs Dies with Corona) చెందాయి.ఈ విషాద పాకిస్థాన్‌లోని జూ పార్క్‌లో జరిగింది. లాహోర్ నగరం‌లోని జూ పార్క్‌లో 11 వారాల వయసున్న రెండు తెల్ల పులి పిల్లలు (Two White Tiger Cubs In Pakistan) జనవరిలో అనారోగ్యానికి గురయ్యాయి. జూ అధికారులు వాటికి చికిత్స అందించారు. అయితే నాలుగు రోజుల చికిత్స తర్వాత ఆ పులి పిల్లలు జనవరి 30వ తేదీన మృతి చెందాయి.

అవి ఎలా చనిపోయాయో అంతు చిక్కలేదు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అక్కడి అధికారులు విచారణ చేపట్టారు. పులి కూనలకు పోస్టుమార్టం చేయగా వాటి ఊపిరితిత్తులు బాగా పాడైనట్లు తెలిసింది. దీనిపై మరింత విచారించగా అవి కరోనా వైరస్‌తో మృతి చెందాయని జూ అధికారులు నిర్ధారించారు. కాగా జూలో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది.

ఆ ఆరుగురిలో పులి పిల్లల బాగోగులు చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి ద్వారా వాటికి కరోనా వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ మొదలుపెట్టారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

వ్యాక్సిన్ తీసుకున్న వైద్యులకు కరోనా, ఐసోలేషన్‌కు వెళ్లిన ముగ్గురు డాక్టర్లు, హిమాచల ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో ఘటన

అయితే పాకిస్తాన్‌లోరోగనిరోధక శక్తిని లక్ష్యంగా చేసుకుని ఫెలైన్ పన్లూకోపెనియా వైరస్ (panleukopenia virus) విరుచుకుపడుతుందని అధికారులు తెలిపారు. అయితే వీటి మరణానికి మాత్రం అది కాదని తేల్చారు. జూ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్ సలీమ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో కరోనాతో 12,256 మంది మృతి చెందారని తెలిపారు.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ జంతుప్రదర్శనశాలలు ఇప్పుడు జంతువుల హక్కుల కార్యకర్తల కోపానికి గురవుతున్నాయి. అక్కడ వందలాది జంతువులు జూ నిర్లక్ష్యం వల్ల అక్కడి జీవన పరిస్థితుల వల్ల చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాహోర్ జంతుప్రదర్శనశాలలో చివరి రెండు తెల్ల పులి పిల్లలు చనిపోయాయి మరియు నిర్వహణ మరియు అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటకు వచ్చింది" అని జెఎఫ్‌కె (జస్టిస్ ఫర్ కికి) యానిమల్ రెస్క్యూ అండ్ షెల్టర్ వ్యవస్థాపకుడు జుఫిషన్ అనుషే రాయిటర్స్‌తో చెప్పారు.

అయితే జంతుప్రదర్శనశాలలో నిర్లక్ష్యం ఆరోపణలను సలీమ్ తిరస్కరించారు, జంతు హక్కుల కార్యకర్తలు ఈ సౌకర్యం యొక్క భద్రత మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లను సందర్శించడానికి మరియు తనిఖీ చేయడానికి స్వాగతం పలుకుతున్నారని రాయిటర్స్‌కు చెప్పారు.మ