Coronavirus 2.0: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రమాదకరమా..? కరోనావైరస్ 2.0 అసలు పేరేంటి? కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుట్టింది? కోవిడ్ 2.0 గురించి పూర్తి సమాచారం

బ్రిటన్ పూర్తిగా ఈ కరోనావైరస్ 2.0 (Coronavirus 2.0) దెబ్బకి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలతో పాటు ఇతర దేశాలు బ్రిటన్ కు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అయితే ఈ లోపే వైరస్ యూకె నుంచి బయటకు వచ్చేసింది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, Dec 22: గతేడాది చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచదేశాలను వణికించింది. దాదాపు ఏడాది పాటు దాని విశ్వరూపాన్ని ప్రజలు చూశారు. దేశాలకు దేశాలే లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. వైరస్ దాడి కారణంగా దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో మళ్లీ కొత్తగా ఈ కరోనావైరస్ ప్రమాదకర రీతిలో దూసుకువస్తోంది.

ఈ సారి బ్రిటన్ వేదికగా ఈ కరోనావైరస్ స్ట్రెయిన్ (New coronavirus strain in UK) ప్రపంచ దేశాలను వణికించేందుకు రెడీ అయింది. బ్రిటన్ పూర్తిగా ఈ కరోనావైరస్ 2.0 (Coronavirus 2.0) దెబ్బకి డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో యూరోపియన్ దేశాలతో పాటు ఇతర దేశాలు బ్రిటన్ కు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అయితే ఈ లోపే వైరస్ యూకె నుంచి బయటకు వచ్చేసింది.

ఇండియాలో తాజాగా బ్రిటన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనావైరస్ గా (New coronavirus strain) నిర్థారణ అయింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ఆ దేశానికి రాకపోకలను నిషేధించింది. అయితే ఈ కొత్త కరోనా వైరస్ ప్రమాదకరమా..వ్యాక్సిన్ కు లొంగుతుందా..లేదా ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ వైరస్ పేరేంటి.. ఎప్పుడు ఎక్కడ బయట పడింది అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..

ఇండియాకు ఎంట్రీ ఇచ్చిన కొత్త కరోనావైరస్, యూకె నుంచి వచ్చిన 5 మందికి కోవిడ్ పాజిటివ్, ఇప్పటివరకు లండన్‌ నుంచి వచ్చిన 8 మందికి కరోనా వైరస్‌

కొత్త SARS-CoV-2 వేరియంట్ ( New SARS-CoV-2 variant) దక్షిణ మరియు తూర్పు ఇంగ్లాండ్‌లో కోవిడ్ -19 కేసులు వేగంగా పెరగడానికి కారణం అని వెల్లడించారు. దీనిని VUI (వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్) 202012/01, లేదా B.1.1.7 వంశం అని సూచిస్తున్నారు. ఇది మానవ శరీరంలోని ముఖ్యమైన కణాలపై దాడి చేస్తుంది. అయితే ఇది తీవ్రమైన వ్యాధి అని మరణాలకు దారి తీసే విధంగా ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇంకా సరైన సమాచారం లేదు.

ఈ వైరస్ ఎలా ఏర్పడిందంటే.. కోవిడ్ వైరస్ జన్యువుల్లో జరిగిన మార్పులు కారణంగా ఈ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ పుట్టుకొచ్చింది. గత అక్టోబర్ లో దక్షిణ లండన్‌లో మొదటిసారిగా ఈరకమైన కేసును గుర్తించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇది బ్రిటన్ మొత్తాన్ని ముంచేసింది. ప్రభుత్వం సైతం చేతులెత్తే స్థాయికి చేరుకుందంటే దీని వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. క్షణాల్లోనే ఈ వైరస్ వ్యాప్తి జరుగుతోంది. యూరప్‌లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్‌ జాడలు కనిపిస్తున్నాయి.

యూకే నుంచి కొత్త కరోనా వైరస్, హైదరాబాద్‌కు బ్రిటన్ నుంచి ప్రయాణికులు, అప్రమత్తమైన తెలంగాణ సర్కారు, వారిని ట్రాక్ చేసే పనిలో బిజీ, యూకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్

గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వైరస్‌ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన కడపటి వార్తలుఅందే సమయానికి 33,364 కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ 4 వచ్చేసింది, డేంజర్ జోన్ లోకి బ్రిటన్, కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, యూకేకు అంతర్జాతీయ రాకపోకలను నిషేధించిన పలు దేశాలు, ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉన్నామని తెలిపిన భారత్

ప్రస్తుత కరోనావైరస్ నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్‌ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యుమార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్‌ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు. అయితే అది లైవ్ లోకి వస్తే కాని పనిచేస్తుందా లేదా అని చెప్పలేమని మరికొందరు చెబుతున్నారు.

కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్

దక్షిణ లండన్‌లో బయటపడ్డ కొత్త రకం వైరస్‌ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే ఈ కరోనా వైరస్‌ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్‌లోనూ ఈ కొత్త వైరస్‌ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

అయితే ఇది కొత్తగా వస్తున్న వ్యాక్సిన్లకు లొంగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎంత మేరకు అది విజయవంతంమవుతుందో ముందు ముందు చూడాలి.



సంబంధిత వార్తలు