Coronavirus in India (Photo-PTI)

New Delhi, December 21: బ్రిటన్‌లో కొత్తరకం వైరస్‌ కలకలం రేపుతున్న సంగతి విదితమే. కొత్త రూపును సంతరించుకున్న కొత్త రూపు సంతరించుకున్న కరోనావైరస్ (New Coronavirus Strain) అడ్డూ అదుపూ లేకుండా విస్తరిస్తున్నదని ప్రభుత్వం తెలిపింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నది. ఈ నేపథ్యంలో పలు దేశాలు బ్రిటన్‌కు విమానాలు, రైళ్ల రాకపోకలను నిలిపివేశాయి. మరికొన్ని దేశాలు కూడా ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్-4 విధించింది.

ఈ నేపథ్యంలో ఇండియా సర్కారు కూడా అలర్ట్ అయింది. కొత్త ర‌కం క‌రోనా వైర‌స్‌పై (new strain of coronavirus) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ (Dr Harsh Vardhan) సోమ‌వారం స్పందించారు. ప్ర‌భుత్వం అలెర్ట్‌గా ఉన్న‌ద‌ని, ఏమాత్రం భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. యూకేలోని కొత్త ర‌కం వైర‌స్‌పై శాస్త్ర‌వేత్త‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఊహాజ‌నిత ప‌రిస్థితులు, వివ‌ర‌ణ‌లు చూసి భ‌య‌ప‌డిపోవ‌ద్దు. ఇక్క‌డ మ‌రీ అంత ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని నేను భావిస్తున్నాను. అయితే మన సైంటిస్టులు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఈ కొత్త రకం వైర‌స్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు అని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు.

ఇవేం కొత్త రోగాలు..కేరళను వణికిస్తున్న షిగెల్లా వ్యాధి, బాలుడు మృతి..పెరుగుతున్న కేసుల సంఖ్య, షిగెల్లా లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

యూకేలో వెలుగుచూసిన ఈ కొత్త ర‌కం వైర‌స్‌పై (New coronavirus strain in the UK) చ‌ర్చించ‌డానికే సోమ‌వారం జాయింట్ మానిట‌రింగ్ గ్రూప్‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. బ్రిట‌న్‌లో క‌నిపించిన ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ (UK Virus Strain) అంత‌కుముందు వైర‌స్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌ని అక్క‌డి ఆరోగ్య మంత్రి హాంకాక్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చాలా దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించాయి.

సెప్టెంబర్‌ నెలలో దేశంలో ఓ రోగిలో కొత్తరకం కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఇది కరోనా వైరస్‌ కంటే ప్రమాదకరమై నదని చెప్పడానికి ప్రస్తుతం ఆధారాలు లేవని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఈ మహమ్మారిని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. వైరస్‌ ప్రభావాన్ని గుర్తించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారని వెల్లడించారు. ఈ కొత్తరకం వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)ను కూడా అప్రమత్తం చేశామన్నారు.

కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్

ఈనేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్‌ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ బాటపట్టింది. అత్యవసర సేవలు మినహా ఇతరత్రా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నింటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జిమ్‌లు, సినిమా థియేటర్లు, బార్బర్‌ షాపులు రెండు వారాలపాటు మూసిఉంటాయని తెలిపింది. దేశవ్యాప్తంగా రెండు వారాలపాటు టైర్‌-4 స్థాయి ఆంక్షలు విధించింది.

బ్రిటన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి. లండన్‌లో కరోనా న్యూ స్ట్రైయిన్‌ విజృంభిస్తుండటంతో పలు యూరోపియన్‌ దేశాలు బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఇందులో భాగంగా బ్రిటన్ నుంచి విమానాల రాకలపై జనవరి 1వరకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానాలు, రైళ్ల రాకపోకలను 24 గంటలపాటు నిలిపివేయాలని బెల్జియం నిర్ణయించింది. ఇటలీ, ఆస్ట్రియా కూడా ఇదేతరహా ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యాయి. బ్రిటన్ సహా దక్షిణాఫ్రికాకు విమానాలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు జర్మనీ తెలిపింది. బ్రిటన్‌ డోవర్‌ పోర్టు నుంచి నౌకల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు.

వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవాళ్లకు గడ్డం రావచ్చు, అందరూ మొసళ్లుగా మారుతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైర్‌ బోల్సనారో, ఫైజర్‌ టీకాపై దాడిని ఎక్కు పెట్టిన బ్రెజిల్ అధ్యక్షుడు

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ‘క్రిస్మస్‌ బబుల్‌' పేరిట ఇచ్చిన కరోనా నిబంధనల సడలింపులను రద్దు చేస్తున్నట్టు దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా రెండు వారాలపాటు టైర్‌-4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌ విమానాల రాకపోకలపై నెదర్లాండ్స్‌, బెల్జియం ఇప్పటికే నిషేధాన్ని అమలు చేయగా, ఇటలీ, ఆస్ట్రియా త్వరలోనే నిషేధం విధించనున్నాయి. తామూ కూడా బ్రిటన్ కు అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు జర్మనీ అధికార వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేస్తామని ఆ వర్గాలు చెప్పాయి.

ఈ తరహా స్ట్రెయిన్‌ వైరస్‌ తొలుత సెప్టెంబర్‌లో ఒక వ్యక్తికి సోకినట్లు తెలుస్తున్నది. ఇంగ్లండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారి సుసాన్‌ హోప్‌కిన్స్‌ మాట్లాడుతూ నూతన వైరస్‌ 70శాతం ఇతరుల్లోకి ట్రాన్స్ మీట్‌ అవుతుందని ద్రువీకరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో క్రిస్మస్‌ వేడుకలు ఇళ్ల వద్దనే చేసుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సూచించారు. కాగా, ఇటలీలో బ్రిటన్‌ తరహా కరోనా స్ట్రెయిన్‌ బాధితుడిని వైద్యులు గుర్తించారు. బాధితుడు, అతని కుటుబం సభ్యులు కొద్దిరోజుల క్రితం యూకే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వ్యాక్సిన్ అమెరికాలో వచ్చేసింది, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అతని భార్యకు తొలి వ్యాక్సిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహూకు తొలి కోవిడ్ వ్యాక్సిన్

మొత్తంగా ఇప్పడు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బ‌ల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెన‌డా, నెదర్లాండ్స్, ఐర్లాండ్, బల్గేరియా, ఇట‌లీలాంటి దేశాలు నిషేధం విధించాయి. క‌రోనా కొత్త వేరియంట్ త‌మ దేశాల్లో అడుగుపెట్ట‌కుండా వీళ్లు ముందు జాగ్ర‌త్త‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు భార‌త ప్ర‌భుత్వం కూడా యూకే విమానాల‌పై నిషేధం విధించాల‌ని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు. త‌క్ష‌ణ‌మే ఈ నిర్ణ‌యం తీసుకోవాలంటూ సోమ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో కొత్త కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ను కొనుగొన్న నేపథ్యంలో సౌదీ అరేబియా సరిహద్దులను మూసివేయడంతో పాటు అంతర్జాతీ విమానాలపై వారం రోజుల పాటు బ్యాన్‌ విధించింది. ఇప్పటికే యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి సౌదీ అరేబియాకు చేరిన ప్రజలందరితో పాటు, కొత్త కరోనా వైరస్‌ వెలుగు చూసిన రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా రెండు వారాల పాటు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. గత మూడు నెలల్లో యూరోపియన్‌ దేశాలను సందర్శించిన వారు కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ పేర్కొన్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ పేర్కొంది.

అలాగే యూకే, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, దక్షిణాఫ్రికా నుంచి విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు రవాణా, మౌలిక సదుపాయాల కల్పన మంత్రిత్వశాఖ సమన్వయంతో ఇంగ్లాండ్‌, డెన్మార్క్‌, నెదర్లాండ్‌, దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక సస్పెన్షన్‌ విధించినట్లు టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెటిన్‌ కోకా ట్విట్టర్‌లో తెలిపారు. కొత్త నిషేధాజ్ఞల మధ్య టర్కీ పౌరులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులందరినీ పరీక్షిస్తామని, ఇప్పటికే మార్గమధ్యలో ఉన్న వారికి నిర్బంధ నియమాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మొరాకో సైతం యూకేకు విమానా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం ఎన్ని రోజులు కొనసాగుతుందో మాత్రం చెప్పలేదు.

ఇదిలా ఉండగా.. ఇతర సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ జాతుల కంటే 70శాతం కంటే ఎక్కువ వ్యాప్తి చెందే కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు యూకే అధికారులు శనివారం ప్రకటించారు. కొత్త కేసులు సగానికిపైగా కొత్త వైరస్‌ కారణంగానేని భావించి యూకే ప్రభుత్వం లండన్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది.

తాజాగా కెనాడా ప్రభుత్వంపై యూకే నుంచి విమానాలపై బ్యాన్‌ విధించింది. కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తోందని, కొత్త రకం స్ట్రెయిన్‌‌పై నియంత్రణ కోల్పోయామని, పరిస్థితి అదుపు తప్పిందని యూకే హెల్త్‌ సెక్రెటరీ మాట్‌హెన్‌కాక్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.