Vijay Sai Reddy Letter: చంద్రబాబుకు బిగిస్తున్న ఉచ్చు, వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు సూచన

అయితే ఈ లేఖపై అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందించారు. ఆయన లేఖకు జవాబు ఇచ్చారు.

Amit Shah and YSRCP MP Vijay Sai Reddy and chandra babu Naidu (Photo-PTI)

Amaravathi, January 12: ఏపీకి సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌ సీబీఐ జేడీగా (CBI JD) నియమించాలంటూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖపై(Vijay Sai Reddy Letter) కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లెటర్ రాసిన సంగతి విదితమే.. అయితే ఈ లేఖపై అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందించారు. ఆయన లేఖకు జవాబు ఇచ్చారు.

‘మీరు రాసిన లేఖ అందింది. మీరు సూచించిన అంశం కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు చెందినది. తగుచర్యలు తీసుకోవాలని ఆ విభాగానికి మీ లేఖను పంపుతున్నాను’ అని అమితాషా పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో(Hyderabad) సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్‌కు (Andhra pradesh)సంబంధంలేని అధికారిని నియమించాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖను ఆయన ఆదేశించారు.

అమరావతిలో భూమి విలువ కోటీ నుంచి రూ.10 లక్షలకు పడిందన్న చంద్రబాబు

గత నెలలో అమిత్‌షాకు ఈ లేఖ రాశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ దురుద్దేశపూర్వకంగానే అప్పట్లో వైఎస్ జగన్‌ను ఇబ్బందులకు గురిచేశారని.. మళ్లీ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని ఆరోపించారు. గత ఐదేళ్లలో సీఎం చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని.. దాని నుంచి తప్పించుకునేందుకే మాజీ జేడీ వద్ద పని చేసిన అధికారిని హైదరాబాద్ సీబీఐ జేడీగా నియమించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

క్లైమాక్స్‌లో రాజధాని అంశం, ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ప్రస్తుత హైదరాబాద్‌ సీబీఐ జేడీ ఏవైవీ కృష్ణ కూడా తెలుగు వ్యక్తే. లక్ష్మీనారాయణ సన్నిహితుడైన హెచ్‌ వెంకటేశ్‌ అనే అధికారి సీబీఐ జేడీగా రావడానికి ప్రయత్నిస్తున్నారు. వెంకటేశ్‌ కర్ణాటకవాసిగా చెప్పుకొంటున్నారు. కానీ అతడి తల్లిదండ్రులు ఏపీకి చెందినవారే. చంద్రబాబు తన మనుషులను సీబీఐలో పెట్టుకొని కేసుల నుంచి రక్షణపొందేందుకు యత్నిస్తున్నారు’. అని విజయసాయిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

విద్యార్థులకు శుభవార్త, 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ల్యాండ్ లైన్ ఫోన్ ద్వారా అనేక సార్లు చంద్రబాబుతో మాట్లాడారని విజయసాయి ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా వైఎస్ జగన్‌కి ఇబ్బందులు సృష్టించారని.. లక్ష్మీనారాయణ తప్పుడు ప్రవర్తన, రాజకీయాలపై సీబీఐలో సైతం అంతర్గత విచారణ జరిగిందని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టేందుకే నిర్మాణ బాధ్యతలు చేపట్టి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది.

రాజమండ్రిని నాలుగవ రాజధానిగా చేయమన్న మంత్రి

అమరావతి పేరుతో టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపిస్తామని జగన్ సర్కార్ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ జేడీ నియామకానికి సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాయడం.. అమిత్ షా ఓకే చెప్పడం ఆసక్తికరంగా మారింది.