AP Capital-Sujana Chowdary: అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు, రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందన్న బీజేపీ నేత జీవీఎల్, ప్రజలను గందరగోళంలోకి నెడుతున్న బీజేపీ నేతలు
రాజధాని అమరావతి విషయంలో రైతుల పోరాటానికి కేంద్రంలోని మా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నానని, ఈ విషయంలో అవసరమైతే తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు.
Amaravathi, January 11: అమరావతిని (Amaravathi) ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) ఒక్క అంగుళం కూడా కదల్చలేరని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి (BJP MP Sujana Chowdary) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి విషయంలో రైతుల పోరాటానికి కేంద్రంలోని మా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నానని, ఈ విషయంలో అవసరమైతే తాను వ్యక్తిగత పోరాటం చేస్తానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటించారు.
విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిని (Capital) కాపాడుకోలేకపోతే మాకీ పదవులు ఎందుకు, పదేళ్లుగా ఎంపీగా ఉండి ప్రయోజనం ఏమిటని అన్నారు.
రాజధాని అంశంపై ప్రతి నిమిషం ఏం జరుగుతోందో కేంద్రం (Central Govt) తెలుసుకుంటోందని, కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మహిళలు, రైతులు గుడికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. ఆరునెలల పాలనలో ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు. ఏది చేసినా చట్ట ప్రకారం చేయాలని, అల్లకల్లోలం సృష్టించాలనుకోకూడదన్నారు.
Here's BJP MP Tweet
144 సెక్షన్ (144 Section) విధించేందుకు సమయం, సందర్భం ఉండదా అని సుజనా ప్రశ్నిం చారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 13 జిల్లాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అమరావతి కోసం 13 జిల్లాల ప్రజలు ఉద్యమించాలన్న ఆయన.. అమరావతిలో అంత జరుగుతున్నా.. శాంతి భద్రతలపై డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
రాజమండ్రిని 4వ రాజధానిగా చేయమన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
ఇదిలా ఉంటే రాజధాని తరలింపు అంశంపై బీజేపీ నేతలు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అంశమని.. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేత జీవీఎల్ (GVL) అన్నారు. బీజేపీ ప్రతినిధిగా తాను ఈ మాట అంటున్నానని, తను చెప్పిందే పార్టీ స్టాండ్ కూడా చెప్పారు.
అమరావతిని రాజధానిగా గుర్తించవద్దని రాష్ట్రపతికి లేఖ
సుజనాచౌదరి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని ఎలా తరలిస్తారో చూస్తానని జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది.