Dokka Manikya Vara Prasad: టీడీపీకి భారీ షాక్, 3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా, మంత్రి మండలికి హాజరు కాని మరో టీడీపీ ఎమ్మెల్సీ, రూల్ 71 అస్త్రం టీడీపీకి పనిచేస్తుందా...?
ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Varaprasad) రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
Amaravathi, January 21: మండలిలో (AP Legislative Council ) వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో టీడీపీకి (TDP)షాక్ తగలింది. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Varaprasad) రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్ దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు?
కాగా అమరావతిని (Amaravathi) మూడు రాజధానులుగా (3 Capitals)విభజించినందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి డొక్కా పోటీ చేశారు.
చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం
మరోవైపు మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి సైతం మండలికి రాలేదు. అనారోగ్యం కారణంగా మండలికి రావడం లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నాబాయి కూడా మండలికి హాజరుకాలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సభలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని
ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా చేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగానే తాను పదవికి రాజీనామా చేశానని డొక్కా చెప్పడంపై టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వ్యతిరేకించే వారే అయితే.. మండలిలో ఓటింగ్ లో పాల్గొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అర్ధాంతరంగా ఇలా రాజీనామా చేయడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు (CRDA) బిల్లులకు ఏపీ శానససభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు ఇవాళ శాసనమండలి ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ రూల్ 71 అస్త్రం ప్రయోగించింది. మండలిలో రూల్ 71 కింద మూడు రాజధానుల తీర్మానంను ప్రతిపాదించింది. రూల్ 71 ప్రకారం 30 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే ఏడురోజుల్లో దానిపై చర్చలు జరపాల్సి ఉంటుంది.
రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి..
ఈ నేపథ్యంలోనే టీడీపీ రూల్ 71 అస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పుడు మండలిలో టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ. ఆ పార్టీకి 34మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీకి కేవలం 9మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించవచ్చనే ఆలోచనలో టీడీపీ ఉంది.
అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్
రూల్ 71 ను (Rule 71)మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు చదివి వినిపించారు. ప్రభుత్వం ఏదైనా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిని తిరస్కరిస్తూ మోషన్ మూవ్ చేసే అధికారం ఉందని చెప్పారు. మండలిలో బిల్లులు ప్రవేశపెట్టడానికంటే ముందుగానే రూల్ 71 కింద చర్చకు టీడీపీ పట్టుపట్టింది.
రూల్ 71 తీర్మానంపై చర్చను ఆమోదిస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పరిస్థితులు టీడీపీ సంకంటంగా మారుతున్నాయి. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు ఓటింగ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తన్నాయి.