MP Politics: బీజేపీ గూటికి 22 మంది రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు

బీజేపీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి (Congress party) రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయింది.

All 22 former-congress-mlas-join-bjp-in-madhya-pradesh (Photo-PTI)

Bhopal Mar 22: మధ్యప్రదేశ్‌లో (Madhya pradesh) శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన 22 మంది రెబల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు (Congress Rebal MLAs) కాషాయం గూటికి చేరారు. బీజేపీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో వీరంతా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరంతా శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీకి (Congress party) రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ సర్కారు కూలిపోయింది.

అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన కమలనాథ్

కాగా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ఇటీవలే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన గ్రూప్‌నకు చెందిన 22 మంది మాజీ ఎమ్మెల్యేలు నడ్డాను కలిశారు. వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయవర్గీయ తెలిపారు.

రాజీనామాల పర్యవసానంగా జరగబోయే ఉప ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వీరికే బీజేపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. కాగా, బీజేపీ త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయనున్నది. ఈ స్థానాలకు కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉప ఎన్నికల తేదీలను ప్రకటించనున్నది.

కాంగ్రెస్ పార్టీకి సింధియా రాజీనామా

అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువుకు కొన్ని గంటల ముందే సీఎం కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. మొత్తం 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడంతో.. కాంగ్రెస్‌ బలం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కమల్‌నాథ్‌ రాజీనామాను గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆమోదించారు. తదుపరి సీఎం నియమితులయ్యే వరకు ఆపద్ధర్మ సీఎం కొనసాగాలని ఆయనను కోరారు.

బల పరీక్షకు ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా 

40 ఏండ్ల నా ప్రజా జీవితంలో స్వచ్ఛమైన రాజకీయాలు చేశా. గత 2 వారాల పరిణామాలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చాయి’ అని కమల్‌నాథ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజాస్వామ్య విలువల కోసమే సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు.

ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు

‘అధికార దాహంతో ప్రజలు తిరస్కరించిన ఒక మహారాజ (సింధియా), దురాశపరులైన 22 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ కుట్రతో ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశాయి‘ అని అన్నా రు.



సంబంధిత వార్తలు