IPL Auction 2025 Live

Kejriwal Warns PAK Minister: నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని, పాక్ మంత్రికి కేజ్రీవాల్ కౌంటర్, మా ఐక్యతను మీ ఉగ్రవాద దేశం దెబ్బ తీయలేదన్న ఢిల్లీ సీఎం

పాక్ మంత్రి (Pakistani minister Chaudhary Fawad Hussain) భారత ప్రధానిని (PM Modi) కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ కౌంటర్ వేశారు.మోడీజీ భారత ప్రధాని, ఆయన మాకూ ప్రధానమంత్రి. ఢిల్లీ ఎన్నికలు (Delhi elections) భారత అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో ‘ఉగ్రవాద సంస్థ ఆర్గనైజర్’ వేలుపెడితే ఊరుకోబోం’ అని పాక్ మంత్రి ట్వీటుకు ఢిల్లీ సీఎం (Arvind Kejriwal) ధీటైన రిప్లయి ఇచ్చారు. భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలన్ని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేదని చెప్పారు.

Narendra Modi also my PM, Pakistan cannot interfere in our elections: aravind Kejriwal defends PM against Pak minister's attack (photo-PTI)

New Delhi, January 31: దాయాది దేశం పాకిస్తాన్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister) దిమ్మతిరిగే కౌంటర్ విసిరారు. పాక్ మంత్రి (Pakistani minister Chaudhary Fawad Hussain) భారత ప్రధానిని (PM Modi) కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ కౌంటర్ వేశారు.మోడీజీ భారత ప్రధాని, ఆయన మాకూ ప్రధానమంత్రి. ఢిల్లీ ఎన్నికలు (Delhi elections) భారత అంతర్గత వ్యవహారం.

ఈ విషయంలో ‘ఉగ్రవాద సంస్థ ఆర్గనైజర్’ వేలుపెడితే ఊరుకోబోం’ అని పాక్ మంత్రి ట్వీటుకు ఢిల్లీ సీఎం (Arvind Kejriwal) ధీటైన రిప్లయి ఇచ్చారు. భారతీయుల ఐక్యతను దెబ్బతీయాలన్ని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఏమీ చేయలేదని చెప్పారు.

కథనం వివరాల్లోకెళితే.. ఇటీవల ఓ ప్రసంగంలో పాకిస్థాన్‌పై యుద్ధం వస్తే వారంలోగా ఆ దేశాన్ని చిత్తుగా ఓడించగలమని ప్రధాని మోదీ (Narendra Modi) ఇటీవలే కామెంట్ చేశారు. దీనిపై పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ రియాక్ట్ అయ్యారు. ‘ఒక్కొక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతుండడంతో నరేంద్ర మోదీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు.

Here's Delhi CM tweet

ఈ ప్రాంతాన్నే నాశనం చేస్తానని బెదిరిస్తున్నారు. ఎకనమిక్ స్లో డౌన్, కశ్మీర్, CAA అంశాల్లో దేశంలో నుంచి, బయటి నుంచి విమర్శలు రావడంతో మోడీ బ్యాలెన్స్ తప్పుతున్నారు. ఇప్పుడు మరో రాష్ట్రం ఢిల్లీలో ఓటమి భయం ఆయన్ని వెంటాడుతోంది. భారత ప్రజలు మోడీ మ్యాడ్‌నెస్‌ను ఓడించాలి’ అని పాక్ మంత్రి అన్నారు.

కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్, 2020లో ఆప్ విజయకోసం వ్యూహాలకు పదును

ఈ నేపథ్యంలోనే మోదీపై పాక్ మంత్రి చేసిన కామెంట్స్‌ను అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. అంతర్గతంగా మేం ఎన్నైనా అనుకుంటాం.. బయటివాడొచ్చి మా ప్రధానమంత్రిని ఏమైనా అంటే ఉరుకోబోమంటూ ఫైరయ్యారు. ‘మా దేశ అంతర్గత వ్యవహారంలో ఓ ఉగ్రవాద రాజ్యం జోక్యాన్ని మేం సహించం’ అని హెచ్చరించారు.

అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్

ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారమని,నరేంద్రమోడీ భారతదేశ ప్రధానమంత్రి అని,మోడీ తనకు కూడా ప్రధానమంత్రి అని,ఆయనను ఏమైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. భారత ప్రధానమంత్రిపై పాకిస్తాన్ నోరెత్తకుండా చేశారు. ప్రధాని మోడీని ఏదైనా అంటే ఒప్పుకునేదే లేదన్నారు.

ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా

కాగా ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ,కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ పాక్ మంత్రికి ధీటైన కౌంటర్ ఇవ్వడంతో ఆయనపై ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్

ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార బీజేపీ-విపక్ష బీజేపీ మధ్య హైవోల్టేజ్ పోటీ నెలకొంది. గతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవాన్ని మళ్లీ ఈ ఎన్నికల్లో మాటగట్టుకోకూడదని బీజేపీ ప్రణాళికలు రచిస్తుండగా,గత చరిత్రను మళ్లీ తిరగరాయాలని ఆప్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. కాగా 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.