Sanjay Raut Interesting Comments: 170 మంది మావైపే ఉన్నారు, త్వరలో 175కి చేరుకుంటాం, బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది?,ఆపరేషన్ లోటస్ ఇక్కడ కుదరదన్న శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్
ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎవరూ మెట్టు దిగడం లేదు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ దాని మిత్రపక్షం శివసేన మధ్య సయోధ్య కుదరడం లేదు. సీఎం పీఠం కోసం రెండు పార్టీలు పట్టిన పట్టు విడవడం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నాప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న చిక్కుముడి వీడలేదు.
Mumbai, November 3: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎవరూ మెట్టు దిగడం లేదు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Election Results 2019) అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ (BJP) దాని మిత్రపక్షం శివసేన ( Shiv Sena) మధ్య సయోధ్య కుదరడం లేదు. సీఎం పీఠం కోసం రెండు పార్టీలు పట్టిన పట్టు విడవడం లేదు. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నాప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న చిక్కుముడి వీడలేదు. ఇది మరింతగా బిగించుకుంటోంది. ఇక శివసేన నాయకులు చేస్తోన్న ప్రకటనలు, వ్యాఖ్యానాలు బీజేపీ మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ( Shiv Sena leader Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలో మరో కీలక మలుపు, ప్రభుత్వ ఏర్పాటు దిశగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి
కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 170 మంది తమ వైపే ఉన్నారని, ఈ సంఖ్య 175కు చేరుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమకే మద్దతు ఇస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. నన్ను‘మహా’ సీఎం చేయమంటున్న రైతు
సంజయ్ రౌత్ ట్వీట్
ఆపరేషన్ లోటస్ (Operation Lotus) ఇక్కడ కుదరదని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు పంచుకోవాలనే ప్రతిపాదనపై తప్ప తాము బీజేపీతో చర్చించడానికి, ఆ చర్చలను కొనసాగించడానికి మరో కారణమంటూ ఏదీ లేదని తేల్చేశారు. 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు మా పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. కొనసాగుతున్న ‘మహా’ సస్పెన్స్, పట్టు విడవని శివసేన
ఆపరేషన్ లోటస్ పేరుతో కర్ణాటక (Karnataka Politics) తరహా రాజకీయాలను అనుసరించానికి బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలను బెదిరించో, బ్రతిమాలుకునో.. తన వైపు తిప్పుకొందని, అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసిందని మండిపడ్డారు.
యడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ అనుసరించిన వ్యూహాలు మహారాష్ట్రలో పనిచేయవని అన్నారు. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు లాక్కోవడానికి బీజేపీ పావులు కదుపుతోందని సంజయ్ రౌత్ విమర్శించారు. ఇలాంటి కుట్రలకు బీజేపీ తెర తీస్తుందనే ఉద్దేశంతో తాము అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆ పార్టీకి మోకరిల్లబోమని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి బీజేపీ నాయకులు ఇప్పటికే వాంఖెడే స్టేడియాన్ని, మహాలక్ష్మి ఆడిటోరియాన్ని బుక్ చేసుకున్నారని, వారి కోరిక నెరవేరబోదని అన్నారు. ఈ సారి శివసేన నాయకుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను పెట్టే సాహసం బీజేపీ ప్రభుత్వం చేయకపోవచ్చని అన్నారు.