Vizag Gas Leak: వైజాగ్‌లో లీకైన గ్యాస్ చరిత్ర ఇదే, దీని పేరు స్టెరిన్ గ్యాస్, 48 గంటల పాటు దీని ప్రభావం, ఈ గ్యాస్ పీల్చితే ఆరోగ్యంపై ప్రభావం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ..?

వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ (LG Polymers Industry in Visakhapatnam) నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్‌ (Styrene Gas Leak in Vizag) లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన గుమ్మల ట్వీట్‌ చేశారు.

visakhapatnam gas leak AP CM YS Jagan to visit Visakhapatnam victims (photo-Twitter)

Visakhapatnam, May 7: విశాఖఫట్నం గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ (LG Polymers Industry in Visakhapatnam) నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్‌ (Styrene Gas Leak in Vizag) లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన గుమ్మల ట్వీట్‌ చేశారు. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, గ్యాస్ లీక్‌పై ప్రధాని మోదీ అత్యవసర భేటీ, హాజరయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు

ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి గురువారం తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైందని (Vizag Gas Leak) ఆమె తెలిపారు. ఈ గ్యాస్‌ లీకేజీ వల్లే వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. దాదాపు 200 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారని వైద్య బృందాలు చెబుతున్నాయి. 9 మంది మరణించారు. ఊపిరి తీసిన విషవాయువు, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ నుంచి రసాయన వాయువు లీక్, ముగ్గురి మృతి, వందలమందికి అస్వస్థత

తప్పనిసరిగా మాస్కులు ధరించాలి

ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో (Visakhapatnam) బయటకు వచ్చే వారు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేదా మూతికి బట్టలు కట్టుకోవాలని జీవీఎంసీ సూచించింది. పరిశ్రమ సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ ఫ్యాక్టరీ నుంచి లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. మనుషులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఓ సారి చూద్దాం.  ఇదొక దురదృష్టకర సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

పీవీసీ గ్యాస్ లేదా స్టెరిన్ గ్యాస్ 

ఈ గ్యాస్‌ను పీవీసీ గ్యాస్ లేదా స్టెరిన్ గ్యాస్ (Styrene Gas) అంటారు. దీని రసాయన ఫార్ములా C8H8. సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోసబుల్ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్ ఇలా పలు ఉత్పత్తులకు వాడతారు. దీనికి రంగు ఉండదు. తీయటి వాసన ఉంటుంది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు గ్యాస్ ప్రభావం వుంటుంది. గ్యాస్ పీల్చిన క్షణాల్లోనే మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బాధితులకు వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోతారు.

క్షణాల్లో చర్మంపై దద్దుర్లు

గ్యాస్‌ను పీల్చిన వెంటనే క్షణాల్లో చర్మంపై దద్దుర్లు వస్తాయి. కంటిచూపుపై ప్రభావాన్ని చూపిస్తుంది. తలనొప్పి , కడుపులో వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. పశుపక్ష్యాదులపై కూడా ఈ గ్యాస్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చెట్టు సైతం నల్లగా మారిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు. చర్మానికి తగిలినా, కంటికి తగిలినా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. . దీర్ఘకాలిక వ్యాధులైన కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులకు గురి చేస్తుంది.

ఆక్సిజన్ తో కలిసిపోయి డయాక్సైడ్ ను ఏర్పాటు చేసుకుంటుంది. 

ఈ క్లోరిన్ వాయువు వాతావరణంలోని ఆక్సిజన్ తో కలిసిపోయి డయాక్సైడ్ ను ఏర్పాటు చేసుకొని అత్యంత ప్రమాదకరంగా మారిపోతుంది. ఇలా మారిన తర్వాత వెంటనే మనుషులతో పాటు మూగజీవాలు పక్షులు ఇలా అన్నీ అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత చనిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తొలిసారిగా 1839లో జర్మనీకి చెందిన ఎడ్వర్డ్ సైమన్ గుర్తించాడు.   విశాఖకు చేరుకోనున్న ఏపీ సీఎం, కేజీహెచ్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్, గ్యాస్ లీక్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి

దీన్ని గాలి, కాంతి, వేడికి ఉంచినపుడు మెల్లిమెల్లిగా గట్టిగా, రబ్బరులా రూపాంతరం చెందుతుంది. దీన్ని ఆయన స్టైరాల్ ఆక్సైడ్‌గా పిలిచాడు. 1845లో ఆగస్ట్ హోప్‌మన్ అనే శాస్త్రవేత్త దీనికి రసాయన ఫార్ములాను కనుగొన్నాడు. దీన్ని రబ్బరు సంబంధిత పరిశ్రమల్లో వాడతారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కూడా వాడుతోంది. అందువల్లే వాయువు రూపంలో ఇది బయటికి వచ్చి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఘటనపై ఎంహెచ్‌ఏ, ఎన్‌డిఎంఎ అధికారులతో మాట్లాడిన ప్రధాని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

డాక్టర్లు సూచిస్తున్న జాగ్రత్తలు

వీలైనంత ఎక్కువ మంచినీళ్లు తాగాలి. తప్పనిసరిగా మాస్క్‌/తడి గుడ్డ ధరించండి. ఇంట్లో ఉన్నా సరే మాస్క్‌ తప్పనిసరి. కళ్ల మంట అనిపిస్తే ఐ డ్రాప్స్‌ వేసుకోవాలి. నీరసంగా అనిపిస్తే సిట్రిజన్‌ టాబ్లెట్‌ వేసుకోవాలి. వాంతి వచ్చినట్టు అనిపిస్తే డోమ్‌స్టల్‌ టాబ్లెట్‌ వేసుకోండి. గ్యాస్‌ ప్రభావం తగ్గించడానికి కొద్దిగా పాలు తాగండి.ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం

పాలిమర్స్‌ గ్యాస్‌ ప్రభావం 48 గంటలు ఉంటుంది. వచ్చే రెండు రోజులు ఇంట్లోనే ఉండండి. చర్మాన్ని సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కంటికి తగిలిన వెంటనే నీళ్లతో కళ్లను శుభ్రం చేసుకోవాలి. పది నిమిషాల పాటు క్రమంగా కడుగుతూ ఉండాలి. వాంతులు వస్తే కచ్చితంగా చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif