Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Visakhapatnam, May 7: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) విశాఖకు బయలుదేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ఆయన కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. అంతకు ముందు విశాఖ ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌ (Vizag Gas Leak Tragedy) ఘటనపై అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం

విశాఖ జిల్లా కలెక్టర్‌, డీజీపీతో మాట్లాడి ప్రమాద కారణాలు, ఇతరత్రా అంశాలపై సమీక్షించారు. మరోవైపు సీఎం జగన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారు. దుర్ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. కీలక సూచనలు చేశారు.

ఘటన జరిగిన తర్వాత తీసుకున్న సహాయ చర్యలతోపాటు.. ఆస్పత్రుల్లో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో విషవాయువులు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ ( LG Polymers industry) నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ విషవాయువులు మూడు కిలోమీటర్ల మేర విస్తరించాయి.  గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఘటనపై ఎంహెచ్‌ఏ, ఎన్‌డిఎంఎ అధికారులతో మాట్లాడిన ప్రధాని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రులకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సంఘటనపై సమీక్షిస్తున్నారు.

Here's AP CMO Tweet

పరిశ్రమకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. కెమికల్ గ్యాస్ లీక్ అవ్వడంతోనే వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పరిశ్రమ యజమానిపై ప్రభుత్వం కేసులు నమోదు చేశారు. ఇదొక దురదృష్టకర సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

ఈ ఘటనపై గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీ అగిపోయిందని.. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Here's ANI Tweet

గ్యాస్‌ లీక్‌ వలన ఉన్నపలంగా ఇళ్లను వదిలివచ్చిన ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని మంత్రి గౌతమ్‌రెడ్డి కలెక్టర్‌కు సూచించారు. ఇప్పటికే మంత్రి అవంతి శ్రీనివాస్‌, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్ ఆర్‌.కె.మీనా‌ ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Here's N Chandrababu Naidu Tweet

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటోన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో విశాఖపట్నం బయలుదేరే అవకాశం ఉంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విశాఖలోని టీడీపీ నేతలు ముందుకు రావాలని ఇప్పటికే ఆయన కోరారు. విశాఖ వెళ్లేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. బాధితులను పరామర్శించి, అలాగే, సహాయక చర్యల్లో పాల్గొంటామని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే ఆయన విశాఖ బయలుదేరుతారు.

ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక ఇదే..

హిందుస్తాన్‌ పాలిమర్స్‌ పేరుతో 1961లో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో దీనిని యూబీ గ్రూప్‌ తీసుకుంది. 1997 జులైలో దక్షిణకొరియాకు చెందిన ఎల్‌జీ గ్రూప్‌(ఎల్‌జీ కెమికల్స్‌) తీసుకుని ఎల్‌జీ పాలిమర్స్‌గా మార్చింది. థర్మాకోల్‌ లాంటివి ఇందులో తయారు చేస్తారు. లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో దీనిని తిరిగి ప్రారంభించారు. ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ గ్యాస్‌ లీకేజీ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.