PM Narendra Modi | File Photo

Visakhapatnam, May 7: విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పరిస్థితులకు సంబంధించి MHA (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ), NDMA (జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ) అధికారులతో మాట్లాడారు. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరి భద్రత మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ (PM Modi Tweet) చేశారు. పెరుగుతున్న మృతుల సంఖ్య, విశాఖకు రానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, అందర్నీ రక్షించుకుంటామని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు

విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ (Home ministry) ఆరా తీసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌లతో (AP DGP) కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. బాధితులకు మరింత మెరుగైన చికిత్స అందించాలని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను పంపాలని కిషన్‌రెడ్డి సూచించారు.

Here's PM Modi Tweet

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, బాధితులను ఆదుకునేందుకు అవసమైన అన్ని చర్యలు చేపట్టాల్సిందిగా కోరినట్టు వరుస ట్వీట్లలో తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ ఘటనపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాతో మాట్లాడి ఆరా తీశారు. ఈ సందర్భంగా అజయ్ భల్లా మాట్లాడుతూ.. విశాఖకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు పంపినట్టు చెప్పారు.

Here's G Kishan Reddy Tweet

విశాఖ గోపాలపట్నం సమీపంలో ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీ ఘటన కలకలంరేపింది. వేకువజామున ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. అలాగే బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

విశాఖ ఎల్‌జి పాలిమర్స్ ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజల తరలింపులో రెడ్ క్రాస్ వలంటీర్ల సేవలను వియోగించుకోవాలని సూచించారు. తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని విశాఖ రెడ్ క్రాస్‌కు గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారు. ట్విట్టర్లో ఈ ఘటనపై అందరూ #VizagGasLeak, #Visakhapatnam మీద అందరూ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

Here's Greater Visakhapatnam Municipal Corporation Tweet

వెంటనే విశాఖ జీవీఎంసీ అధికారులు స్పందించారు. ఫ్యాక్టరీ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండేవారిని అప్రమత్తం చేసింది. స్థానికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ఆర్ ఆర్ వెంకటాపురంతో పాటూ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ముక్కు, నోరు కవర్ చసేలా మాస్క్‌లు, బట్టలు కట్టుకోవాలని అధికారులు సూచించారు. ఆర్ ఆర్ వెంకటాపురంతో పాటూ ఐదు గ్రామాలపై ప్రభావం ఉందన్నారు. ముఖ్యంగా శ్వాసపరమైన ఇబ్బందులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఏ, ఏ ప్రాంతాల వారు అలర్ట్‌గా ఉండాలో జీవీఎంసీ ట్వీట్ చేసింది.

.