Visakhapatnam, May 7: విశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ (Vizag LG Polymers Gas Leak) ఘటనలో మృతి చెందినవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దాదాపు ఏడు మంది మృతి చెందారని వార్తలు అందుతున్నాయి. ఆర్ఆర్ వెంకటాపురంలో (RR Venkatapuram village) ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి (KGH Hospital) కిక్కిరిసిపోయింది. దాదాపు 200 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసిన విషవాయువు, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ నుంచి రసాయన వాయువు లీక్, ముగ్గురి మృతి, వందలమందికి అస్వస్థత
మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వేయి మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
25 అంబులెన్సులు, పోలీసు వాహనాలతో బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే, విధుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న ఓ కానిస్టేబుల్ ఈ వాయువు పీల్చి రోడ్డుపైనే కుప్పకూలాడు. గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కేజీహెచ్‌కు తరలించారు.
Here's ANI tweet
CM YS Jagan Mohan Reddy will leave for Vizag & visit King George Hospital where the affected are being treated. Chief Minister is closely monitoring the situation and has instructed the district machinery to take immediate steps and provide all help: CMO #VizagGasLeak https://t.co/1RsJRGTT7e
— ANI (@ANI) May 7, 2020
కాగా గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీకైంది. అది గాల్లో 3కి.మీ మేర వ్యాప్తి చెందడంతో స్థానికులపై తీవ్ర ప్రభావం పడింది.కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు.
Here's ANI Tweet
Andhra Pradesh: 3 persons, including one child, dead after chemical gas leakage at LG Polymers industry in RR Venkatapuram village, Visakhapatnam. pic.twitter.com/zs4oWuN2KA
— ANI (@ANI) May 7, 2020
కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు.
Here's Gas leak Effect on people
Tragedy in Vizag, AP this morning with a gas leak from a Plastic Fiber manufacturing unit LG Polymers ...100s unconscious & being rushed to hospital...my colleague @RishikaSadam reports atleast 3 feared dead...
People rushed out of home and collapsed outside@AndhraPradeshCM pic.twitter.com/SZh7b1FL3Q
— Payal Mehta/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) May 7, 2020
#Vizag Eight dead, over 5,000 fall sick after gas leak from LG Polymers chemical plant ... #VizagGasLeak pic.twitter.com/qVp4t2yUxS
— Supriya Bhardwaj (@Supriya23bh) May 7, 2020
లీకేజీని అరికట్టేందుకు స్థానిక అధికారులు,పరిశ్రమ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్,విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులకు ఫోన్ చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు మొదలుపెట్టాలని.. ప్రభుత్వం నుంచి ఏ అవసరమున్నా అందించడానికి సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు.
విశాఖపట్నంలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులను అప్రమత్తం చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. అందరినీ రక్షించుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను ప్రభుత్వం వెంటనే కాపాడాలని ఆయన సూచించారు. యుద్దప్రాతిపదికన వెంటనే ప్రజలందరినీ ఖాళీ చేయించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గ్యాస్ లీకై ఊళ్లు ఖాళీ చేయాల్సి రావడం బాధాకరమని, బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన సూచించారు. బాధితులకు వెంటనే అత్యున్నత వైద్య సాయం అందించాలని చంద్రబాబు కోరారు.