Hyderabad, May 7: విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన (Visakhapatnam Gas Leak) ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు కేసీఆర్ తెలిపారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం
ఇక విశాఖ గ్యాస్ లీక్ (Vizag Gas leakage) ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ( IT Minister KTR)ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చాలా భయంకర ఘటనలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీక్ కావడంతో ఇప్పటికే 8 మంది చనిపోయారు. సుమారు 200 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి. చెట్లు మాడిపోయాయి. ఈ రసాయన వాయువును పీల్చిన కొందరైతే ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. సొమ్మసిల్లి రోడ్లపైనే పడిపోయారు. మొత్తానికి విశాఖ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
.