New Delhi, May 7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌లో (LG Polymers industry) రసాయన వాయువు లీకేజీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi ) స్పందించారు. ఈ దుర్ఘటనపై (Visakhapatnam Gas Leak) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి (AP Chief Minister YS Jagan Mohan Reddy)ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విషాద ఘటనపై ఎంహెచ్‌ఏ, ఎన్‌డిఎంఎ అధికారులతో మాట్లాడిన ప్రధాని, విశాఖకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు
కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. మరోవైపు గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు.
Here's PMO Tweet
PM @narendramodi has spoken to Andhra Pradesh CM Shri @ysjagan regarding the situation in Visakhapatnam. He assured all help and support.
— PMO India (@PMOIndia) May 7, 2020
In the wake of the situation in Visakhapatnam, PM @narendramodi has called for a meeting of the NDMA at 11 AM.
— PMO India (@PMOIndia) May 7, 2020
విశాపట్నం జిల్లా జిల్లా పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారుజామున రసాయన వాయువు లీకేజీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పెరుగుతున్న మృతుల సంఖ్య, విశాఖకు రానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, అందర్నీ రక్షించుకుంటామని తెలిపిన ఐటీ మంత్రి గౌతం రెడ్డి, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
ఇప్పటికే మంత్రులు, అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేయగా.. మరికాసేట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఘటనాస్థలికి చేరకోకున్నారు. సహాయ చర్యలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు.
.