Bloating Reducing Tips: కడుపు ఉబ్బరంగా ఉంటుందా, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ కావడం లేదా, వెంటనే మీ ఆహార పదార్థాల మెనూలో మార్పులు చేసుకోండి, ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గించుకోవచ్చు
ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది.
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. ఆధునిక కాలంలో మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టకపోవడం, నిరంతర ఆలోచనలు, కారణం లేకుండానే కోపం రావటం, సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి వేధిస్తోంది. మనలను వివిధ రకాల ఇబ్బందులకు, అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ (Bloating) ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు.అనేక ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్య గురించిన సరైన అవగాహన ఉంటే దీనిని ఎదుర్కొనడం ( Foods to reduce bloating quickly) కష్టమేమీ కాదు.
ఈ వ్యాధికి కారణాలు ఏంటంటే.. కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం, అధిక టీ/కాఫీ సేవనం, సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, అలసట, మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఆందోళన, దిగులు, కుంగుబాటుకు లోనుకావడం వంటి మానసిక కారణాలు, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్‌ట్రబుల్ సోకడానికి కారణాలుగా (what causes bloating in the stomach) చెప్పుకోవచ్చు.
వీటికి తోడు బీన్సు, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్, పాలు, పాల ఉత్పత్తులు, గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్ వంటి పండ్లను అధికంగా సేవించడం వల్ల గ్యాస్‌ట్రబుల్ సమస్య జఠిలమవుతుంది. ద్రవ, ఘన ఆహార స్వీకరణ సమయంలో గాలిని మింగడం, మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు, మధుమేహం, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబిఎస్) వంటి కొన్ని వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్థత మొదలైన కారణాలు కూడా గ్యాస్ సమస్యను కలిగిస్తాయి. ప్రేవుల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌లలో కొన్ని, ముఖ్యంగా మిథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు అంతిమంగా అపాన వాయువు రూపంలో వెలువడుతాయి.
గ్యాస్ ట్రబుల్ లక్షణాలు
కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
ఆకలి లేకపోవడం
పెద్ద శబ్దంతో తేంపులు రావడం
కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, పొట్టలో గడబిడలు, ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం, అపాన వాయువు ఎక్కువగా పోతుండడం, జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం, నోటిలో నీళ్ళు ఊరడం, వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వైద్యపరిభాషలో ఈ లక్షణాలను డిస్పెప్పియా అంటారు.
కడుపు ఉబ్బరం నివారణా చర్యలు
సరైన వేళకు ఆహారం తీసుకోవడం.
నీరు ఎక్కువగా త్రాగండి.
వ్యాయామం చెయ్యడం
వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడాలి.
మసాలాలు, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్, టీ, కాఫీలు మానివేయాలి. నిల్వ ఉంచిన పచ్చళ్ళు తినడం మానేయాలి. కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే ఆహారపదార్థాలు తింటే కూడా కడుపులో గ్యాస్ పెరుగుతుంది. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
జీవనశైలి, జీవనవిధానంలో మార్పు, ఆహార నియమాలు పాటించడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ లాంటి ఆటలు, క్రీడలలాంటి శారీరకశ్రమతో కూడిన వ్యాయామాలు, కడుపు నిండుగా ఒకేసారి ఆహారం తీసుకోకుండా ఉండటం చేయాలి. మనం రోజువారి తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచిది. తినేదాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని బాగా నమిలి మింగడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. కార్బొనేటెడ్ కూల్‌డ్రిరక్స్, చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా కడుపులో గ్యాస్ పెరుగుతుంది.
ఈ పుడ్స్ తో గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోవచ్చు.
వెల్లుల్లి :మొత్తం జీర్ణవ్యవస్థనే శుభ్రం చేసి, కడుపు ఉబ్బరాన్ని పూర్తిగా తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంది. భోజనానికి ముందు రెండు వెల్లుల్లి రెబ్బలను మింగండి. ఆ తర్వాత భోజనం చేయండి. కింది నుంచి గ్యాస్ వెళ్లిపోయి కడుపు తేలిక అవుతుంది.
అల్లం:అల్లంతో నియంత్రణ: యాసిడ్ రిఫ్లెక్షన్ కు అల్లం ఒక ఉత్తమ ఆహారం. అల్లంను యాంటీఇన్లమేటరీ మరియు జీర్ణకోశ వ్యాధులకు కొరకు పురాతన కాలం నుండి చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజరాల్ మరియు షోగోల్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి . పొట్ట ఉదరభాగంలో గ్యాస్ చేరకుండా నివారిస్తుంది.
మింట్ టీ:పుదీనా ఆకులు: కొద్దిగా పుదీనా ఆకులను శుభ్రం చేసి, నీటిలో వేసి బాగా మరగ కాచి, ఆ నీటిని గోరువెచ్చగా భోజనం తర్వాత తాగాలి. ఇలా చేస్తుంటే బ్లోటింగ్ మరియు క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. నరాలను బలోపేతం చేసి తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
గుమ్మడి:డైలీ డైట్ లో గుమ్మడిని చేర్చుకోవడం వల్ల కడుపుబ్బరం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు . కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ రిలీవ్ అవుతుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
సోంపు:కడుపు ఉబ్బరంను నయం చేసే లక్షణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే భోజనం చేసిన వెంటనే సోంపు నములుతుంటారు కొందరు. ఇది ప్రేగులో గ్యాస్ ను మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి.
కొత్తిమీర:కొత్తిమీర మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ . కడుపుబ్బరాన్ని క్షణాల్లో పోగొడుతుంది. ఒక కప్పు కొత్తిమీర టీ త్రాగడం వల్ల కడుపుబ్బరం తగ్గతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది . పొట్టనొప్పి తగ్గిస్తుంది.
తులసి:పొట్టలో గ్యాస్ ను విచ్చిన్నం చేసే అద్భుతమైన లక్షణాలు తులసిలో దాగి ఉన్నాయి. ఇది పొట్టలకు ప్రశాంతతను అందిస్తుంది.
పెరుగు:పెరుగులో ఒక మంచి ల్యాక్టో బాసిల్లస్ ఉండి, ఇది ప్రొబయోటిక్ గా పనిచేస్తుంది. ఇది డీస్ట్రెస్సింగ్ స్టొమక్ బ్లోటింగ్ ను తగ్గిస్తుంది. పాలలాగ ఇది అపానవాయువుకు కారణం కాదు. మరియు అసౌకర్యానికి గురిచేయదు.
కారవే సీడ్స్:కొన్ని కారవే సీడ్స్ ను నోట్లో వేసుకొని నమలడం ద్వారా ఉపశమనం కలుగుతుంది . చాలా త్వరగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది . కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక సులభ మార్గం
నిమ్మరసం:కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, కొంత మంది ద్రవాలు త్రాగడాన్ని నిరాకరిస్తుంటారు. కాబట్టి, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కొన్ని ద్రావాలను కొద్దిగా కొద్దిగా త్రాగడం చాలా అవసరం. ముఖ్యంగా, గోరువెచ్చని నీటికి నిమ్మరసం మిక్స్ చేసి త్రాగడం వల్ల ఒక అద్భుత మ్యాజిక్ చేస్తుంది. త్రాగిన 30నిముషాల్లోనే మీరు ఫలితాన్ని గమనించవచ్చు. ఈ డ్రింక్ ను మీరు ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం మొదలు పెడితే మరింత ఉత్తమ ఫలితాలను పొందచ్చు.
మీరు ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా చేయడం వల్ల చాలావరకు గ్యాస్ సమస్య అధిగమించవచ్చు. తినే సమయంలో మెల్లగా, నింపాదిగా తినాలి. పెదవులు మూసి తినడం మంచిది. ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి. ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. ∙ సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్ వంటి వాటికి దూరంగా ఉండాలి ∙జ్యూస్ రూపంలో కాకుండా పండ్లను కొరికి, నమిలి తినాలి.
గ్యాస్ ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవడం ∙కొవ్వులు ఉండే పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం ∙వేళకు తినడం (చాలా మంది వేళకు తినకుండా చాలా ఆలస్యంగా తింటుంటారు. వారిలో గ్యాస్‌తో కడుపు ఉబ్బరం రావడం చాలా ఎక్కువ) ∙మనం ఏం తింటున్నామో గమనిస్తూ, వాటిలో దేనివల్ల కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువవుతోందో గుర్తించి, ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.
దాల్చినచెక్క కడుపుబ్బరాన్ని సమర్థంగా తగ్గిస్తుంది. ఒక గ్లాసెడు వేడి నీళ్లలో ఒక కాస్తంత దాల్చిన చెక్క పొడితో పాటు ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే పొట్ట ఉబ్బరం తగ్గి కడుపు తేలిగ్గా అనిపిస్తుంది.∙బ్రిస్క్‌వాకింగ్ గానీ, జాగింగ్ లేదా రన్నింగ్ వల్ల కడుపులోని గ్యాస్ కదిలి బయటకు వెళ్తుంది. ఇదే అలవాటును కొనసాగిస్తే కడుపు ఉబ్బరం ఉండదు. పండ్లు తినే సమయంలో కొన్ని రకాల పండ్లలో (ముఖ్యంగా ఆపిల్, పియర్ వంటి వాటిల్లో) సార్బిటాల్ అనే చక్కెరలాంటి పదార్థం ఉంటుంది. ఇది కడుపుబ్బరాన్ని కలిగించవచ్చు.