Sex Tips for Busy Couple: పని ఒత్తిడితో సెక్స్ లైఫ్ మిస్ అవుతున్నారా, ఈ చిట్కాలతో మీరు శృంగారంపై మరింతగా ఆసక్తి పెంచుకోవచ్చు, మీ భాగస్వామితో మరింతగా ఎంజాయ్ చేయవచ్చు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా..
Sex Tips for Busy Couple (Photo Credits: Pixabay)

శృంగార జీవితాన్ని సరిగా గడపలేని లేని జంటలు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. రోజంతా కష్టపడి అన్ని పనులు చేశాక శృంగారానికి ఓపిక ఉండదు కదా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ సంతోషమైన జీవితానికి పనితో పాటు శృంగారం కూడా ముఖ్యమే అని చాలామంది సైకాలజిస్టులు అంటున్నారు. సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసినప్పుడే జీవితంలో అన్ని పనులు బాగా చేయగలుగుతాం అంటున్నారు. శృంగారంపై ఆసక్తి పెంచడానికి .. పని ఒత్తిడిని దూరం చేసుకుని సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కొన్ని చిట్కాలు (Sex Tips for Busy Couple) ఉన్నాయంటున్నారు నిపుణులు.. అవేంటో ఓసారి చూద్దామా...

చాలా మంది తమ భాగస్వామితో సెక్స్ (HOT Sex for Happy Marriage) విషయాలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ శృంగారం గురించి, బెడ్ రూంలో మీ పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవడం వల్ల మీ అభిప్రాయాలు బయటపడతాయట. తద్వారా మీ శృంగార జీవితం మరింత సుఖంగా (Make Your Long-Term Marriage Happier) మారుతుందట. చాలా మంది భార్యభర్తలు కేవలం బెడ్ రూంలోనే తప్ప మిగతా సమయాల్లో ఒకరినొకరు తాకరు. అలా కాకుండా బయట కూడా చిన్న చిన్న తాకిడిలు వల్ల మీలో శృంగార ఆసక్తిని రెట్టింపు చేస్తాయట. ఉదాహరణకు చేతులు తాకించడం, ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య చనువు పెరిగి, బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన పోలీస్ జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెక్సికోలో వేస్ట్ ఫీల్డ్ ప్రాంతంలోని పోలీస్ సెక్స్ వీడియో, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు

ఇక రోజూ ఒకేలా సెక్స్ చేయడం వల్ల కూడా శృంగార జీవితం బోర్ కొడుతుందట. కాబట్టి అప్పుడప్పుడు సెక్స్ స్టైల్ మార్చడం వల్ల ఇద్దరిలోనూ ఆసక్తి పెరుగుతుందంటున్నారు. మీ పడకగదిలో మీకు నచ్చని విషయాల గురించి .. మీరు బాగా ఎంజాయ్ చేసిన నిమిషం గురించి మాట్లాడుకోవడం వల్ల మీ శృంగార జీవితంలో సానుకూలత పెరుగుతుందట. ఇలాంటి సందర్భాలను గుర్తుచేసుకుని ఒకరిని ఒకరు పొగుడుకోవడం వల్ల శృంగార జీవితం మరింత సుఖమయం అవుతుందని చెబుతున్నారు.

షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

మీ భాగస్వామితో శారీరకంగా కలవడం కోసం ముందు నుంచే మానసికంగా సిద్ధం చేయడం మంచిది. అలాగే వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల సెక్స్ కెపాసిటీ పెరుగుతుందట. వ్యాయామం మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరిచి.. శృంగార కోరికలను కూడా పెంచుతుంది. కలిసి తినడం, టీవీ చూడటం, కలిసి స్నానం చేయడం లాంటి చిన్న చిన్న విషయాలు కూడా దాంపత్య జీవితాన్ని బలంగా తయారు చేసి.. శృంగార జీవితాన్ని మరింత ఎంజాయ్ చేసేలా చేస్తాయని సెక్స్ నిపుణులు చెబుతున్నారు.

పెళ్లయి మూడేళ్లయినా శోభనం లేదు, తీరా చూస్తే భర్త స్వలింప సంపర్కుడు, విడాకులు కావాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న బాధిత భార్య, కర్ణాటకలో ఘటన

ఇంట్లో భార్య ఇది చేయాలి, భర్త ఇది చేయాలి అని షరతులు పెట్టుకోకుండా.. ఇద్దకు కలిసి పని చేసుకోవడం వల్ల కూడా శృంగార జీవితం బాగుంటుందంట. ఒకరి పనులు ఒకరు చేయడం వల్ల పరస్పరం ప్రేమ, గౌరవం పెరిగి పడక గదిలో సంతోషంగా గడుపుతారట. ఒకవేళ మీ భాగస్వామి శృంగార విషయంలో ఆసక్తి చూపకపోతే.. రాత్రుళ్లు కాకుండా వేరే సమయాల్లో శృంగారంలో పాల్గొనండి. ఖాళీ సమయం ఉంటే.. ఉదయమో, మధ్యాహ్నమో ట్రై చేసి చూడండి.