Karnataka: పెళ్లయి మూడేళ్లయినా శోభనం లేదు, తీరా చూస్తే భర్త స్వలింప సంపర్కుడు, విడాకులు కావాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న బాధిత భార్య, కర్ణాటకలో ఘటన
Mobile (Photo Credit: File)

Bengaluru, July 27: కర్ణాటకలో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. తన భర్త ప్రొపైల్ ను గే డేటింగ్ యాప్ లో చూసిన భార్య షాక్ అయింది. పెళ్లయిన మూడేళ్ల నుంచి తనతో ఎందుకు కలవడం లేదో తెలుసుకుని ఒక్కసారికి నివ్వెరపోయింది. తన గొంతు కోసి పెళ్లి చేశారని ఆరోపిస్తూ బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. 31 ఏళ్ల బ్యాంకు ఉద్యోగితో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి 2018 జూన్‌లో వివాహమైంది. అతడికి ఇది రెండో వివాహం. పెళ్లయి మూడేళ్లు అవుతున్నా ఆమెతో పడక గదిలో గడపడం లేదు. ఆ దంపతుల మధ్య ఇప్పటివరకు ఫస్ట్ నైట్ జరగలేదు. భార్య ఎంతగా ప్రయత్నించినా భర్త అందుకు అంగీకరించకుండా.. ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. అంతే కాకుండా తన లోపాన్ని కప్పి పుచ్చి వరకట్నం అడిగినంత ఇస్తేనే నీతో కలుస్తానని చెప్పాడు. అడిగినంత డబ్బు ఇస్తున్నా ఇద్దరు కలిసినప్పుడు అతను సరిగా పనిచేయకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది.

ఐఫోన్ నన్ను ‘గే’ గా మార్చింది, ఆపిల్ రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాల్సిందే, కోర్టును ఆశ్రయించిన రష్యన్, ఇంకా అధికారికంగా స్పందించని ఆపిల్

వేరే యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడేమోనని అతడి ఫోన్‌ తీసుకుని పరిశీలించింది. నిజాలు తెలిసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్‌ చేస్తున్నాడు. దీంతోపాటు గే యాప్‌లలో ఆయన ప్రొఫైల్‌ (Discovering his profiles on gay dating apps) ఉంది. ఇది చూసి ఆమె షాక్‌కు గురయ్యింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు రహాస్యం బహిర్గతపరిచాడు. తాను స్వలింప సంపర్కుడినని.. గే డేటింగ్‌ యాప్‌లలో (Gay dating apps) ప్రొఫైల్‌ ఉందని అంగీకరించాడు.

Here's IANS Tweet

దీంతో ఆమె అతడితో విడిపోవాలని (woman sought divorce from her husband) నిశ్చయించుకుంది. వెంటనే ఆమె బవసణ్నగుడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం కేసును వాయిదా వేసింది.అయితే అతడి మొదటి భార్య కూడా ఇదే కారణంతో అతడిని వదిలేసి ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం ముందే తెలిసీ తనకు అతడితో పెళ్లి చేశారని బాధితురాలు భర్త కుటుంబసభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విడాకులు కావాలని భార్య న్యాయస్థానంలో పోరాడుతోంది.