Asthma Diet: ఆస్తమాను కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు, ఈ పుడ్స్ తీసుకుంటే మీరు ఉబ్బసం నుండి త్వరగా బయటపడవచ్చు, ఆస్తమా ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రత్యేక కథనం
Asthma | Image used for representational purpose only (Photo Credits: PTI)

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య ఆస్తమా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24.5 కోట్లకు పైగా ఆస్తమాతో (Asthma) బాధపడుతున్నారని అంచనా. వారిలో ఒక్క భారత్‌లోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఉన్నట్టు సమాచారం.ఇంకా విషాదకర అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాతో ఒక్క 2015లోనే 3,83,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో 11 ఏళ్ల లోపు చిన్నారుల్లో నూటికి 5 నుంచి 15 మంది ఆస్తమా (asthma symptoms) బారిన పడుతున్నారు. ఆస్తమా సమస్య వున్నవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పెడటమే కాకుండా ఏ పనిపై ధ్యాస లేకుండా చికాకు పుట్టిస్తుంది.

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల కూడా నాళాలు సన్నబడతాయి. దీని వల్ల గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ లక్షణాలు అన్నీ ఆస్తమా కిందకే వస్తాయి. దీనిని ఉబ్బసం అని కూడా పిలుస్తుంటారు.

ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి. వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాల కారణంగా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. . పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. చలికాలం, పెంపుడు జంతువులు, వాటి ఉన్ని, గాలిలోని రసాయనాలు, ఘాటు వాసనలు, అతిగా చేసే శారీరక శ్రమ, పుప్పొడి రేణువులు, ఇవన్నీ ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణమవుతాయి.

పని ఒత్తిడితో సెక్స్ లైఫ్ మిస్ అవుతున్నారా, ఈ చిట్కాలతో మీరు శృంగారంపై మరింతగా ఆసక్తి పెంచుకోవచ్చు, మీ భాగస్వామితో మరింతగా ఎంజాయ్ చేయవచ్చు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా..

ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం, దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును. ఈ సమస్యను వదిలించుకునేందుకు (Diet tips for asthma) మందులు వున్నప్పటికీ ఆహారంలోనూ కొన్ని మార్పులు (Asthma diet) చేసుకుంటే ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఉల్లిపాయ: ఉల్లిపాయల్లో యాంటీ - ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్‌స్ట్రక్షన్ తగ్గుతుంది. అలాగే కమలాలు, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ 'సి' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు చెపుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి. రెడ్ క్యాప్సికంలో సి విటమిన్‌ ఎక్కువ. ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడంలో బాగా దోహదపడుతుంది. కనుక దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

షుగర్ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏమవుతుంది, వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు గుడ్డు తింటే వారికి గుండె జబ్బుల ముప్పు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం

ఇంకా యాపిల్ పండులో ఉండే ' ఫైటోకెమికల్స్' ఆస్త్మాతో ఇబ్బంది పడేవారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో 'లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్సిడెంట్‌గా ఆస్త్మా రోగులకు మేలు చేస్తుంది. మెగ్నీషయం పాలకూరలో వుంటుంది. ఆస్త్మా లక్షణాలను తగ్గించడంలో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తంలోనూ, టిష్యూలలోను మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘ కాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడం వలన ఆస్త్మా సమస్య తగ్గుతుంది. కాబట్టి ఆస్త్మా లక్షణాలను తగ్గించడములో పాలకూర బాగా సహకరిస్తుంది.

ముక్కులో వెంట్రుకలు తీసేయకండి, అరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు, శ్వాస వ్యవస్థ ఆరోగ్యం కోసం ముక్కు వెంట్రుకలు అవసరమంటున్న నిపుణులు

విటమిన్ డీ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి. ప్రివెంటర్లు వాయునాళాల కండరాల వాపును తగ్గించి, శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడాల్సి రావచ్చు. అయితే వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వేసుకోవాలి.

జాగ్రత్తలు

ఆస్తమా ఉన్న వారు సమస్య మరింత తీవ్రం కాకుండా ధూమనానానికి దూరంగా ఉండాలి.

దుమ్మూదూళికి దూరంగా ఉండాలి.

శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్‌వాటర్ వంటి పడని పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఇంట్లో బూజు దులపడం వంటివి ఆస్తమా ఉన్నవారు చేయకూడదు.