Tulsi Leaves (Photo Credits: Azlin/Pixabay)

హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు. తులసి పూజనీయమైనదే కాక లెక్కలేనన్ని ఔషధ గుణాలు కూడా దీనిలో ఉన్నాయి. ఈ తుల‌సి ఆకుల‌ను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలే (Basil Uses benefits) చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాస‌న‌, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో స‌మ‌స్య‌లకు తుల‌సి ఆకులు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం (Health Benefits of Holy Basil) చూపిస్తాయి. మన పెరట్లోని తులసి చెట్టు ఇచ్చే ఔషధ గుణాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

కఫం పడుతున్న వ్యాధులపై తులసి అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు తులసి ఆకులు (Benefits Of Basil Leaves) నాలుగు చొప్పున ప్రతి గంటగంటకూ తింటే దగ్గు, ఇతర సమస్యలు తగ్గుముఖం పడతాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.

జీర్ణ శక్తికి తులసి చాలా మంచి మందు. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. ముఖ్యంగా 7, 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటారు. ఆకలి లేదంటుంటారు. అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

ఆస్తమాను కంట్రోల్ చేసే ఆహార పదార్థాలు, ఈ పుడ్స్ తీసుకుంటే మీరు ఉబ్బసం నుండి త్వరగా బయటపడవచ్చు, ఆస్తమా ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై ప్రత్యేక కథనం

ప్రధానంగా తులసి జ్వరహారిణి. సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. పైగా టైఫాయిడ్ జ్వరంలో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూటా తాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది. ఉబ్బసాన్ని నివారించడంలో తులసి కీలకమైన ఔషధం. ఉబ్బస నివారణ ఆయుర్వేద మందులన్నింటిలోనూ తులసి తప్పకుండా ఉంటుంది. తరచుగా ఉబ్బసానికి గురయ్యేవారు తులసి కషాయం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు ఉబ్బసం రాదు.

అవసాన దశలో ఉన్న మనిషికి తులసి తీర్థం పోయడంలో అర్థం ఏమిటంటే వారి గొంతులో కఫం ఏమైనా అడ్డుపడకుండా శ్వాస సరిగా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి, శరీరంలో శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. కీళ్ల సమస్యలను, రక్త స్రావాలను నిరోధించటానికి ఉపకరిస్తుంది.

తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటు బాధలకు నివారిణిగా కూడా లవంగ తులసి పని చేస్తుంది. చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యలు, చంటి పిల్లల్లో వాంతుల నివారణకు పని చేస్తుంది. లవంగ తులసి ఆకుల రసం వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది. కాలేయ వ్యాధుల నివారణకు, కాలేయ పనితనాన్ని మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది. దోమలను వికర్షించు శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. షుగర్ వ్యాధికి తీసుకును ఔషధాల పనితనాన్ని మెరుగుపరచడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది.

పని ఒత్తిడితో సెక్స్ లైఫ్ మిస్ అవుతున్నారా, ఈ చిట్కాలతో మీరు శృంగారంపై మరింతగా ఆసక్తి పెంచుకోవచ్చు, మీ భాగస్వామితో మరింతగా ఎంజాయ్ చేయవచ్చు, సైకాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దామా..

ఈ మొక్క నుంచి సుగంధ పరిమళభరితమైన వాసన వస్తుంటుంది. ఇందుకు కారణం దీనికి కారణం యూజెనాల్, మిథైల్ యూజెనాల్, కారియోఫిల్లీన్, సిట్రాల్, కేంఫర్, థైమాల్ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్స్ ఉండటమే. ఇటువంటి ఆరోమాటిక్ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పని చేస్తాయి.

ఇక పళ్లు తెల్లగా మెరవాలంటే తులసి టూత్ పౌడర్ వాడితే సరిపోతుంది. తులసి టూత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తాజాగా ఉండే తులసి ఆకులను తీసుకొని నీడలోనే ఎండబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఎండిన తర్వాత, ఆకును మెత్తగా నూరి పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఉపయోగించి బ్రష్‌చేసి మీ దంతాలపై పసుపు రంగును నిర్మూలించుకోండి. తులసి పౌడర్ ఉపయోగించి చేతి వేలితో కూడా బాగా రుద్దడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఇంకా, మీ రెగ్యులర్ పేస్ట్‌కు తులసి పౌడర్‌ను జతచేసి, బ్రష్ చేసుకోవచ్చు. తద్వారా మీ పళ్ళు మెరిసిపోవడమే కాకుండా, ఇతర దంత సమస్యలను కూడా అరికట్టడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

తులసి ఆకు ప్రయోజనాలు

కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.

తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.

జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.

కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).

తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.

తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.

తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.

నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

గొంతు నొప్పి కూడా చాలా మందిలో భ‌రించ‌రాని స‌మ‌స్య‌గా ఉంటుంది. ఈ స‌మ‌స్య ఉన్న‌వాళ్లు నీళ్ల‌లో తుల‌సి ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఆ త‌ర్వాత ఆ నీళ్లు గోరువెచ్చ‌గా మార‌గ‌నే తాగాలి. దాంతో గొంతునొప్పి మ‌టుమాయం అవుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.

ఇంకా తుల‌సి ర‌సంలో తేనె క‌లిపి తీసుకుంటే కూడా మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉండ‌టంవ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు. సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు కూడా త‌గ్గుతాయి. నోటిపూత‌కు కూడా ఇది మంచి ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

తుల‌సి ఆకులకు శ‌రీరంలో కొవ్వును త‌గ్గించే గుణం కూడా ఉంటుంది. తుల‌సి ఆకుల‌ను ప్ర‌తిరోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా మజ్జిగ‌తో క‌లిపి తీసుకుంటే బ‌రువు అదుపులో ఉంటుంది. ఇక నిద్ర‌లేమితో బాధ‌పడేవారు తుల‌సి ఆకుల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.