Karnataka Shocker: గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి.. ఆడుకుని ఇంటికొచ్చి గుండెనొప్పితో విలవిల్లాడిన చిన్నారి.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి.. కర్ణాటకలో ఘటన
అయితే, 35 ఏళ్లు దాటిన వారికి కూడా హార్ట్ ఎటాక్ ముప్పు పొంచి ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, ఇది అందర్నీ ఆలోచించేలా చేసే బాధాతప్త ఘటన.
Bengaluru, Jan 9: 50 ఏళ్లు పైబడిన వారు గుండెపోటు (Heart Stroke) బారినపడుతూ మరణించడం తెలిసిందే. అయితే, 35 ఏళ్లు దాటిన వారికి కూడా హార్ట్ ఎటాక్ (Heart Attack) ముప్పు పొంచి ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, ఇది అందర్నీ ఆలోచించేలా చేసే బాధాతప్త ఘటన.
మహిళలు చదువుకుంటేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్న నితీశ్ కుమార్.. బీజేపీ ఫైర్.. వీడియోతో
అప్పటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించిన ఉదంతమిది. కర్ణాటకలోని (Karnataka) మడికేరి జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.
శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు.