Patna, Jan 9: మహిళలు (Women) చదువుకున్నప్పుడే జనాభా నియంత్రణ (Population control) సాధ్యమవుతుందని బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీశ్ కుమార్ (Nitish kumar) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘సమాధాన్ యాత్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నితీశ్ కుమార్.. వైశాలిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మహిళలు విద్యావంతులైనప్పుడు గర్భం (Pregnancy) దాల్చకుండా ఏమేం చేయాలనే దానిపై వారికి అవగాహన ఉంటుందని అన్నారు.
ఈ విషయంలో మగవారు నిర్లక్ష్యంగా ఉంటారని అన్నారు. మహిళలు నిరక్షరాస్యులు కావడం వల్ల అణచివేతకు గురవుతూ జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారని నితీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బహిరంగ సభలో సీఎం ఇలా మాట్లాడడం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను, ముఖ్యమంత్రి పదవిని ఆయన దిగజార్చారని బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.