లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది. ఇక ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.
నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ సంక్షేమం కోసం తెచ్చిన బిల్లు కాదని.. సుప్రీం లీడర్ ఈగోను మసాజ్ చేయడానికి మాత్రమే తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ONOE బిల్లులు పరోక్షంగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసి ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తాయని AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
TDP Support to One nation One Election bill
జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ మద్దతు
లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్… pic.twitter.com/wu3LCELLzu
— ChotaNews (@ChotaNewsTelugu) December 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)