Martina Navratilova: కేన్సర్లతో పోరాడతానన్న మార్టినా.. గొంతు, రొమ్ము కేన్సర్ బారినపడిన టెన్సిస్ దిగ్గజం

18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. న్యూయార్క్‌ లో ఆమె చికిత్స తీసుకోనున్నారు.

Credits: Twitter

Newyork, Jan 3: 18  గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌షిప్ (Championship) టైటిళ్లను (Titles) గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా (Martina Navratilova) గొంతు (Throat), బ్రెస్ట్ (Breast) కేన్సర్ (Cancer) బారినపడ్డారు. న్యూయార్క్‌ లో ఆమె చికిత్స తీసుకోనున్నారు. కేన్సర్‌తో తాను పోరాడతానని మార్టినా ఈ సందర్భంగా పేర్కొన్నారు. మార్టినా 2010లోనే బ్రెస్ట్ కేన్సర్ బారినపడ్డారు. ఆ తర్వాత ఆమె శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు మరోమారు ఆమెను కేన్సర్లు చుట్టుముట్టాయి. అయితే, ఇవి ప్రారంభ దశలోనే ఉన్నాయని, కోలుకుంటానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు. చికిత్సకు కేన్సర్ రకం స్పందిస్తున్నట్టు చెప్పారు. రెండు కేన్సర్లు తీవ్రమైనవే అయినా కోరుకున్న ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వాటితో తాను పోరాడతానని ధైర్యం ప్రదర్శించారు.

నిలకడగా రిషబ్ పంత్ ఆరోగ్యం, ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందన్న భయంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్‌ చేసిన వైద్యులు

9 సార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన మార్టినా నవ్రతిలోవా ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ కోసం ఓ టెన్నిస్ చానల్‌లో కామెంటరీ చెప్పాల్సి ఉంది. అంతలోనే ఆమెకు కేన్సర్లు నిర్ధారణ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. గొంతు కేన్సర్ మొదటి దశలోనే ఉందని, ఈ నెల నుంచే ఆమెకు చికిత్స ప్రారంభమవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆమెకు సోకిన కేన్సర్ హెచ్‌పీవీ రకమని, ఇది చికిత్సకు స్పందిస్తుందని పేర్కొన్నారు.

ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

గత డబ్ల్యూటీఏ ఫైనల్స్ సందర్భంగా మెడ భాగంలో గడ్డను గమనించినట్టు మార్టినా చెప్పారు. దీంతో బయాప్సీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని, పరీక్షల్లో కేన్సర్ తొలి దశలో ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. మార్టినా గొంతు పరీక్షలు చేయించుకున్న సమయంలో రొమ్ములో అనుమానాస్పద రూపం బయటపడిందని, అది కూడా కేన్సర్ అని నిర్దారణ అయిందని పేర్కొన్నారు. అయితే, ఇది గొంతు కేన్సర్‌కు సంబంధం లేదని వైద్యులు తెలిపారు. రెండు కేన్సర్లు తొలి దశలోనే ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

నవ్రతిలోవా మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు, 9 వింబుల్డన్‌లు, 4 యూఎస్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్నారు. కాబట్టే ఆమెను టెన్నిస్‌లో దిగ్గజ క్రీడాకారిణిగా ఖ్యాతిగాంచారు.

అనసూయను ఘోరంగా అవమానించిన యాంకర్ రష్మీ గౌతం, తనకు క్యారెక్టర్ మాత్రమే ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని చెప్పిన రష్మీ

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Cancer Warnings For Alcoholic Drinks: మందు తాగుతున్నారా? అయితే, మీకు ఒకటి కాదు రెండు కాదు ఏడు రకాల క్యాన్సర్లు రావొచ్చు.. అమెరికా సర్జన్‌ జనరల్‌ నివేదికలో వెల్లడి

Navjot Kaur Gets Rs.850 Crore Notice: క్యాన్స‌ర్ ట్రీట్ మెంట్ పై వివాదంలో న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ, ఆయ‌న భార్య‌కు రూ. 850 కోట్లుకు లీగ‌ల్ నోటీసులు

Covid-Cancer Link: కరోనా మంచే చేస్తున్నది.. ప్రాణాంతక క్యాన్సర్ పని పడుతున్నది.. క్యాన్సర్‌ కణాలపై పోరాడే ప్రత్యేక మోనోసైట్లను ఉత్పత్తి చేస్తున్న కొవిడ్.. ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్‌ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్

Share Now