Vijayawada, Jan 3: ఉత్తర కోస్తా (Northern Costal Area)లోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో (Rayalaseema) మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. ఉత్తర భారతదేశం (Northern India) నుంచి మధ్య భారతం మీదుగా ఉత్తర కోస్తా వరకు చలి గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమ గాలులు వీస్తున్నాయి.
ఒకేసారి చలి, తేమ గాలులు వీస్తుండడంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొందని, వర్షాలకు అదే కారణమని అధికారులు తెలిపారు. అలాగే, వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో చలి స్వల్పంగా పెరుగుతుందని పేర్కొన్నారు.