రాష్ట్రీయం

Visakhapatnam Road Accident: ఎవరో చేసిన తప్పుకు అభం శుభం తెలియని చిన్నారులు... విశాఖపట్నం రోడ్డు ప్రమాదంపై సజ్జనార్ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వీడియో షేర్ చేస్తూ.. విశాఖపట్నంలో స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురవడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాద దృశ్యాలు చాలా హృదయవిదారకంగా ఉన్నాయి.

Visakhapatnam Road Accident: ఆటో డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణం, మూడు పల్టీలు కొట్టిన ఆటో, 100 మీటర్లు దూరం వెళ్లి ఆగిన లారీ, విశాఖపట్నం రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు

Hazarath Reddy

విశాఖ నగరంలోని సంగం శరత్‌ థియేటర్‌ కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఆటో సిగ్నల్ దగ్గర వేగంగా దూసుకువస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది.ఆటో బోల్తా పడగా అందులోని చిన్నారులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

Visakhapatnam Accident Video: విశాఖ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, సిగ్నల్ దగ్గర లారీని బలంగా ఢీకొట్టిన స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటో

Hazarath Reddy

Visakhapatnam Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం,స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ, ఎనిమిది మంది చిన్నారులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

విశాఖపట్నంలోని సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేతని స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Telugu States Weather: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాబోయే మూడురోజుల పాటూ అక్కడక్కడా వానలు పడుతాయని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, రాబోయే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఇదే!

VNS

మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో (GHMC) ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Sangareddy Fire Accident: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం, కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు, తప్పిన ప్రాణాపాయం (వీడియో ఇదుగో..)

VNS

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్‌ఎన్‌ (MSN) రెండో యూనిట్‌లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. MSN పరిశ్రమలో స్టోరేజీ విభాగంలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉంచారు. కెమికల్స్ నిల్వ ఉంచిన డ్రమ్ములు పేలడంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.

MBBS Students Fight Video: వీడియో ఇదిగో, క్లాస్ రూంలోనే చితకబాదుకున్న కాబోయే డాక్టర్లు, ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో గ్రూపు వార్, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఒంగోలు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికల్ విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే కొట్టుకున్నారు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు క్లాస్ రూంలోనే చితకబాదుకున్నారు.ఈ ఘర్షణలో కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు

AP FiberNet Scam: ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి, రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ పైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

Advertisement

AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు 

Hazarath Reddy

కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది.

Telangana Assembly Election 2023: కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే, భట్టి గెలిచేది లేదు, సీఎం అయ్యేది లేదు, మధిర ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికలు మరో 10 రోజుల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది.అధికార బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ లతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా మధిరలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

Chandrababu Bail Row: చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంకోర్టుకు జగన్ సర్కారు, అత్యున్నత న్యాయస్థానం నిర్ధేశించిన కొలమానాలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని వెల్లడి

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబుకి హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కంటి శస్త్ర చికిత్స నిమిత్తం మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను పూర్తిస్థాయి బెయిల్‌గా మారుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Andhra Pradesh: ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.161.86 కోట్ల నిధులు విడుదల, 23,458 కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్

Hazarath Reddy

గోదావరి జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను సీఎం విడుదల చేశారు

Advertisement

TS Weather Alert: తెలంగాణలో మూడు రోజులు వర్షాలే.. వాతావరణ శాఖ అలర్ట్‌

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఉరుములతో జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది.

CM Jagan: సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన రద్దు.. వర్షం కారణంగా హెలికాప్టర్‌ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో నిర్ణయం

Rudra

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మంగళవారం చేపట్టాల్సిన పర్యటన రద్దయింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Vivek Venkataswamy: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంటిపై ఐటీ దాడులు.. కొనసాగుతున్న తనిఖీలు.. వివేక్ అనుచరుల ఇళ్లలోనూ దాడులు

Rudra

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంటిపై ఈ తెల్లవారుజామున ఐటీ అధికారులు దాడులకు దిగారు. ఉదయం ఐదున్నర గంటలకు మంచిర్యాల లోని ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆయన అనుచరుల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు వీడియోలో చూడండి.

CM Jagan Review on AP Bifurcation Act: విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం, 13వ షెడ్యూల్‌ ప్రకారం మన నిధులు మనకు రావాల్సిందే, విభజన చట్టంపై సీఎం జగన్ సమీక్ష హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేపు(మంగళవారం) కేంద్ర హెంశాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి అధి​కారులు హాజరుకానున్నారు. ఈ మేరకు అక్కడ చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Advertisement

Visakhapatnam Harbour Fire: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం, బాధితులకు బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, ప్రమాదానికి కారణాలు ఏంటంటే..

Hazarath Reddy

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారత చాటుకున్నారు. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana Stadium Wall Collapse Video: తెలంగాణలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం, ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

Hazarath Reddy

మొయినాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ ఇండోర్ స్టేడియం గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడినట్లు అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికి తీశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు

WC 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తట్టుకోలేక గుండెపోటుతో యువకుడు మృతి, తిరుపతి జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా తిరుపతి జిల్లాలో భారత్ పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు గుండుపోటుతో మరణించాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

Skill Development Scam Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఊరట, రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు ఎలా సాగాయంటే..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాజా తీర్పు వెలువరించింది. చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది

Advertisement
Advertisement