AP Corona Report: వైజాగ్‌లో ఒకరి నుంచి 20 మందికి కరోనా, కోలుకున్న కర్నూలు, ఏపీలో 2051కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, 1056 మంది డిశ్చార్జ్

దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ చెయ్యబడ్డ వారి సంఖ్య 1056 కి చేరింది. రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరింది. ఏపీలో నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసులకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949గా ఉంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, May 12: ఏపీలో గడిచిన 24 గంటల్లో 58 మంది కోవిడ్ (AP COVID-19) నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ చెయ్యబడ్డ వారి సంఖ్య 1056 కి చేరింది. రాష్ట్రంలో 24 గంటల్లో 10,730 సాంపిల్స్ ని పరీక్షించగా 33 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. దీంతో ఏపీలో (Andhra Pradesh) మొత్తం కేసుల సంఖ్య 2051కి చేరింది.

ఏపీలో నమోదైన మొత్తం 2051 పాజిటివ్ కేసులకు గాను 1056 మంది డిశ్చార్జ్ కాగా, 46 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 949గా ఉంది. ఈ మేరకు ఏపీ ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సీఎం వైయస్ జగన్‌పై అసభ్యకర పోస్టులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈపై వేటు, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చర్యలు తప్పవన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

కొత్తగా నమోదైన కేసులను (AP Coronavirus) ఓ సారి పరిశీలిస్తే.. చిత్తూరులో తాజాగా 10 కేసులు నమోదయ్యాయి. కర్నూలు 9, క్రిష్ణా 4, నెల్లూరు 9, తూర్పుగోదావరిలో 1 కేసు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 584 కేసులు నమోదు కాగా, గుంటూరులో 387 కేసులు, క్రిష్ణాలో 346 కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ 115, చిత్తూరు 131, కడప 97, నెల్లూరు 111 కేసులు నమోదయ్యాయి.  రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్

కర్నూలు క్రమంగా కరోనా నుంచి కోలుకుంటోంది. తాజాగా సోమవారం శాంతిరామ్‌ ఆస్పత్రి నుంచి 12 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో కర్నూలుకు చెందిన 9 మంది, నంద్యాల అర్బన్‌ ఇద్దరు, బనగానపల్లె రూరల్‌ , చాగలమర్రి,కోడుమూరుకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 281కి చేరింది. మరోవైపు 278 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Here's AP Corona Report

జిల్లాలో సోమవారం కొత్తగా 9 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులన్నీ కర్నూలు నగరంలోనే నమోదయ్యాయి. దీంతో నగరంలో కరోనా బాధితుల సంఖ్య 366కు చేరింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 575 మంది కరోనా బారిన పడ్డారు. ఏపీ సీఎం జగన్ చర్యపై టీఎస్ సీఎం కేసీఆర్ ఆగ్రహం, ఎత్తిపోతల పథకంపై ఏపీ నిర్ణయం తీవ్ర అభ్యంతరకరం అని వ్యాఖ్య, వెంటనే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశం

కొద్దిరోజుల క్రితం వరకు విశాఖ జిల్లాలో 20–25 మధ్యే ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా 66కు ఎగబాకాయి.దీనికి కారణం ఒక్కరేనని అధికారులు నిర్థారించారు. అతని ద్వారా దాదాపు 20 మందికి కరోనావైరస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర భద్రతా బలగాల్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తిని కరోనా వాహకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. ఏపీలో షాపుల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

చెన్నైలో పనిచేస్తున్న సదరు వ్యక్తి సుమారు నెలన్నర క్రితం దండుబజార్‌ ప్రాంతంలోని చందక వీధిలోని తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఇంట్లో ఇరుగుపొరుగువారు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో యథేచ్ఛగా పేకాట, హౌసీ వంటి ఆటలు నిర్వహించాడు. ఫలితంగానే వైరస్‌ విజృంభించినట్లు వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి చేసే వారిని కేంద్ర ప్రభుత్వం సూపర్‌ స్ప్రెడర్, స్ప్రెడర్లు(వాహకులు)గా గుర్తిస్తోంది. అదే కోవలో ఈ వ్యక్తిని స్ప్రెడర్‌గా అధికారికంగా గుర్తించే ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టారు.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ వెసులుబాటు సమయాన్ని పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని చోట్లా కార్యకలాపాలకు అనుమతి తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని దుకాణాల నిర్వహణకు అనుమతి తెలిపింది. సరి-బేసి సంఖ్యలో దుకాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.



సంబంధిత వార్తలు