IMR AG Meets AP CM: కడపలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన, సహకరించాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ఐఎంఆర్ ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఎలాంటి సహకారానికైనా సిద్ధమన్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఆ దిశగా ఏపీ సర్కారు (AP Govt) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లాలో (YSR Kadapa) మరో భారీ స్టీల్ ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ (IMR AG) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు (IMR Company Representatives) గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసారు. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
Amaravati,Mar 05: ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఆ దిశగా ఏపీ సర్కారు (AP Govt) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ జిల్లాలో (YSR Kadapa) మరో భారీ స్టీల్ ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ (IMR AG) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్యాలయం
ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు (IMR Company Representatives) గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని (YS Jagan Mohan Reddy) కలిసారు. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.
10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ. 12 వేల కోట్లకు పైగా పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నామని సీఎం జగన్ కి వారు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం వైయస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.
Here's CMO Andhra Pradesh Tweet
అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసిన సీఎం రావత్
ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుపుతున్నామంటూ ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.
కాగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారానికైనా సిద్ధమని ఏపీ సీఎం జగన్ వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్ జిల్లాలో తలపెట్టిన స్టీల్ ప్లాంట్ (Steel Plant in Kadapa) ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామని సీఎం ఎంఆర్‌ఐ ప్రతినిధులకు తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
కర్నూలు టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్యాయత్నం
ఐఎంఆర్ కూడా ఏపీలో మరొక స్టీల్‌ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని ఏపీ సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడి నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు.
ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ
పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. రానున్నరోజుల్లో వైఎస్సార్ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్, ఐఎంఆర్ ఏజీ ఛైర్మన్ హాన్స్ రడాల్ఫ్ వైల్డ్, కంపెనీ డైరెక్టర్ అనిరుధ్ మిశ్రా, సెడిబెంగ్ ఐరన్ ఓర్ కంపెనీ సీఈఓ అనీష్ మిశ్రా, గ్రూప్ సీఎఫ్‌ఓ కార్ల్ డిల్నెర్, టెక్నికల్ డైరెక్టర్ సురేష్ తవానీ, ప్రాజెక్ట్స్ ప్రెసిడెంట్ అరిందమ్ దే, ఫైనాన్స్ డైరెక్టర్ సంజయ్‌సిన్హా , ఏపీ ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ఎండీ పి మధుసూదన్ పాల్గొన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)